విర్చ్యువల్ విండ్‌స్క్రీన్‌తో మరింత ఫాస్ట్‌గా డ్రైవ్ చేయొచ్చు

By Ravi

టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్), డ్రైవర్లు తమ ఫాస్ట్ డ్రైవింగ్‌ను మెరుగు పరచుకునేందుకు గాను ఓ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. సెల్ఫ్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా డ్రైవర్ల దృష్టి రోడ్డు మీదనుంచి మళ్లించకుండా ఏకాగ్రతగా డ్రైవ్ చేసేలా ఒక అల్గారిథమ్‌ను జేఎల్‌ఆర్ రూపొందిస్తోంది. ఇందుకోసం కంపెనీ ఓ విర్చ్యువల్ విండ్‌స్క్రీన్‌ను సిద్ధం చేసింది.

ఈ విర్చ్యువల్ విండ్‌స్క్రీన్ సాయంతో డ్రైవింగ్ విధానాన్ని ట్రాక్ చేసి, రోడ్ డ్రైవింగ్ మెరుగు పరచుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సిస్టమ్ యాక్సిడెంట్లను నివారించవచ్చని జేఎల్‌ఆర్ డెరైక్టర్ (రీసెర్చ్ అండ్ టెక్నాలజీ) వోల్ఫ్‌గాంగ్ ఈపిల్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నిక్‌ల ద్వారా ఈ స్మార్ట్ కార్లను రూపొం దిస్తున్నామని ఆయన వివరించారు.


ఇప్పటివరకూ జరిగిన సెల్ఫ్ లెర్నింగ్ కార్ రీసెర్చ్ అంతా ట్రాఫిక్, నావిగేషన్ అంచనాలకే పరిమితమైందని, ఇకపై దానిని తాము మరో దశ ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ సెల్ఫ్ లెర్నింగ్ డ్రైవింగ్‌తో డ్రైవింగ్ అనుభూతి పూర్తిగా మారిపోతుందని ఈపిల్ చెప్పారు.

ఈ టెక్నాలజీ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఈ స్మార్ట్ జాగ్వార్ కార్లు తమను నడిపే డ్రైవర్‌ను క్షుణ్ణంగా అధ్యయం చేస్తాయి. దీనినే సెల్ఫ్ లెర్నింగ్ అంటారు. అంటే, కారు నడిపే డ్రైవర్ తీరు, డ్రైవింగ్ విషయంలో అతని ప్రవర్తన, కారులోని పలు ఫీచర్ల (స్టీరింగ్, సీట్స్, మిర్రర్స్)ను అతను ఎలా సర్దుబాటు చేస్తున్నాడు మొదలైన అంశాలను విర్చ్యువల్ విండ్‌స్క్రీన్ పసిగడుతుంది.

Virtual Windscreen Helps You Drive Faster

ఒక్కసారి వీటిని అధ్యయనం చేసిన తర్వాత, సదరు కార్ డ్రైవర్ తిరిగి కారును ఎక్కినప్పుడు ఇదివరటి సెట్టింగ్స్ ప్రకారం కారులో పలు ఫీచర్లు దానంతట అవే ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేయబడుతాయి. సాధారణంగా చాలా మంది డ్రైవర్లు ఫోన్ ఉపయోగిస్తూ, మిర్రర్లు, స్టీరింగ్, సీట్స్‌లను అడ్జెస్ట్ చేస్తూ ఏమరుపాటుగా వాహనం నడుపుతుంటారు. అయితే, ఈ టెక్నాలజీ వలన డ్రైవర్ ఏమరపాటుకు గురికాకుండా ఉండి, అతని దృష్టంతా రోడ్డుపైనే కేంద్రీకృతం అవుతుందని, ఫలితంగా ప్రమాదాలు తగ్గుతాయని జాగ్వార్ చెబుతోంది.

ఈ ఫ్యూచర్ జాగ్వార్ కార్స్‌లోని స్మార్ట్ అసిస్టెంట్ ఫీచర్, కారు నడిపే వారి డైలీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా నావిగేషన్‌ను ముందుగానే సెట్ చేస్తుంది. ఆ షెడ్యూల్ ప్రకారం, సదరు వ్యక్తి తర్వాత వెళ్లాల్సిన గమ్యాన్ని కూడా ఇది ముందుగానే సెట్ చేసుకుంటుంది. బయటి వాతావరణానికి అనుగుణంగా కారు లోపలి వాతావరణాన్ని మారుస్తుంది.

జాగ్వార్ సెల్ఫ్ లెర్నింగ్ టెక్నాలజీని వివరించే వీడియోను మీరు కూడా చూసేయండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/FeK9IkSD_nI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Tata Motors owned Jaguar Land Rover has showcased its new technology that would help drivers improve their fast driving. The British marque has developed a virtual windscreen to enhance performance driving and reduce distraction. It will be mainly used for track driving and can improve road driving too.&#13;
Story first published: Monday, July 14, 2014, 20:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X