కార్ల్ స్లిమ్ సూసైడ్ నోట్ లభ్యం; ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు!

By Ravi

టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యావహరిస్తున్న కార్ల్ స్లిమ్ (Karl Slym) ఆదివారం బ్యాంకాక్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసినదే. బ్యాంకాక్‌లో ఓ బహుళు అంతస్థుల భవనంలోని 22వ అంతస్తు నుంచి క్రిందపడి కార్ల్ స్లిమ్ దుర్మరణం చెందారు. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేశారా లేక కార్ల్ స్లిమ్ తనంతట తానే క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, కార్ల్ స్లిమ్ మృతిపై థాయ్‌లాండ్ పోలీసుల ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. కార్ల్ స్లిమ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే అభిప్రాయాన్ని థాయ్‌లాండ్ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆయన హత్యకు గురై ఉండే అవకాశాల్లేవని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఒకరు చెప్పారు. యన్నావా జిల్లాలోని రివర్‌సైడ్ షాంఘ్రి-లా హోటల్‌లో స్లిమ్ బస చేసిన గదిలో 3 పేజీల సూసైడ్ నోట్‌ను దొరికిందని, ఈ లేఖలో కొంతవరకూ ఇంటి సమస్యల ప్రస్తావన ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Karl Slym

అయితే, ఆ లేఖను రాసింది కార్ల్ స్లిమ్ అవునా కాదా అనే అంశాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. బ్రిటిష్ జాతీ యుడైన కార్ల్ స్లిమ్ బసచేసిన గదిలో పెనుగులాట జరిగిన దాఖలాల్లేవు. స్లిమ్ ఈ నెల 24న తన భార్య (30)తో కలసి హోటల్ రూములో దిగారు. వాస్తవానికి కార్ల్ స్లిమ్ దంపతులు ఆదివారం రోజున (జనవరి 26న) హోటల్ ఖాళీ చేయాల్సి ఉంది. కానీ అదే రోజు స్లిమ్ ఆ హోటల్‌లో ఆకస్మికంగా మరణించడం గమనార్హం.

కార్ల్ స్లిమ్ దంపతులు బస చేసిన గదికి బాల్కనీ లేదు. ఓ పెద్ద అద్దం, దానికో చిన్న కిటికీ మాత్రమే ఉన్నాయని, ఆ కిటికీ లోనుంచి బయటపడటం చాలా కష్టమని, ఆదివారం నాడు ఉదయం 7.45 గంటలకు నాలుగో అంతస్తులోకి పడి మరణించిన స్లిమ్ దేహాన్ని గుర్తించామని హోటల్ సిబ్బంది తెలిపారు. ఆ సమయంలో గదిలో నిద్రిస్తున్న ఆయన భార్యకు ఈ విషయాన్ని చెప్పడంతో ఆమె షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ విషయంలో స్లిమ్ భార్యను కూడా ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు.

కాగా.. కార్ల్ స్లిమ్ అక్టోబర్ 2012లో టాటా మోటార్స్‌లో చేరారు. ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర మందగమనంలో సాగుతున్న సమయంలో టాటా మోటార్స్ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన స్లిమ్, భారత మార్కెట్‌లో తమ సంస్థ నిలదొక్కుకోవడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని టాటా మోటార్స్ కొనియాడింది. కార్ల్ స్లిమ్ మరణం నేపథ్యంలో, టాటా మోటార్స్ కొత్త ఎండి నియామకం త్వరలో జరగనుంది. కొద్ది రోజుల్లోనే డెరైక్టర్ల బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Most Read Articles

English summary
Tata Motors MD Karl Slym died in Bangkok after a fall on Sunday. Slym, was in Thailand to attend a meeting of the board of directors of Tata's subsidiary in the country. New details also emerged on Monday of the circumstances surrounding Slym's death, with Thai police saying the 51-year-old may have committed suicide.
Story first published: Tuesday, January 28, 2014, 11:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X