లాంబోర్గినీ హురాకన్‌కు ప్రపంచ వ్యాప్తంగా 3000 బుకింగ్స్

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ నుంచి తాజాగా మార్కెట్లోకి వచ్చిన 'లాంబోర్గినీ హురాకన్' (Lamborghini Huracan) సూపర్‌కారుకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కారు ఉత్పత్తి సామర్థ్యానికి మించి బుకింగ్స్ వస్తున్నాయి. ఈ కారు కోసం ఇప్పటికే 3000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. గడచిన సెప్టెంబర్ నెలలో ఇది భారత మార్కెట్లో విడుదలైంది.

ఒక్క భారతదేశం నుంచి లాంబోర్గినీ హురాకన్ కోసం 10 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చాయట. లాంబోర్గినీ ఏటా 2000 యూనిట్ల హురాకన్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కానీ, దీని బుకింగ్స్ మాత్రం 3000 యూనిట్లను దాటడంతో, ఆలస్యంగా బుక్ చేసుకున్న కస్టమర్లు మరింత ఎక్కువ కాలం ఈ కారు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

lamborghini huracan global

ఇక లాంబోర్గినీ హురాకన్ విషయానికి వస్తే.. కంపెనీ అందిస్తున్ పాపులర్ గల్లార్డో సూపర్ కారు స్థానాన్ని రీప్లేస్ చేస్తూ ప్రవేశపెట్టబడిన మోడలే ఇది. లాంబోర్గినీ హురాకన్ కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ లాంబోర్గినీ డోపియా ఫ్రిజియోన్ (ఎల్‌డిఎఫ్) సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఈ కారు కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని, 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 325 కిలోమీటర్లు. లాంబోర్గిని హురాకన్‌‌ను 1879 కాలానికి చెందిన స్పానిష్ ఫైటింగ్ బుల్ (దున్నపోతు) నుంచి స్ఫూర్తి పొంది ఈ పేరును పెట్టడం జరిగింది. 'లాంబోర్గినీ హురాకన్ ఎల్‌పి 640-4' పేరులో ఎల్‌పి అంటే, 'లాంగిట్యూడినేల్ పోస్టెరీయోర్'. ఇది ఇంజన్ ఓరియంటేషన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఇందులో 610 అంటే ఇంజన్ నుంచి వెలవడే శక్తి (పిఎస్‌లలో), 4 అంటే ఫోర్ వీల్ డ్రైవ్ అని అర్థం. భారత మార్కెట్లో లాంబోర్గినీ హురాకన్ ధర రూ.3.43 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Most Read Articles

English summary
Italian super car maker Lamborghini has received 3,000 bookings of Huracan in global markets in the span of just 10 months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X