అమ్మకాలు లేకనే లాకౌట్: టొయోటా కార్మికుల సంఘం

వేతనాల సవరణలో విషయంలో కార్మికులతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో, టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) బెంగుళూరుకు సమీపంలో బిడది వద్ద ఉన్న తమ రెండు కార్ల తయారీ ప్లాంట్లలో గత ఆదివారం లాకౌట్ ప్రకటించిన సంగతి తెలిసినదే. అయితే, ఈ లాకౌట్ అన్యాయయని, ఈ విషయంలో ఏక్షపక్షంగా నిర్ణయం తీసుకున్నారని టికెఎమ్ ఎంప్లాయిస్ యూనియన్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: టొయోటా ఎతియోస్ క్రాస్ వివరాలు

ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా లాకౌట్ ప్రకటించారని యూనియన్ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ చెప్పారు. వాస్తవానికి గత కొద్ది కాలంగా కార్ల అమ్మకాలు సరిగ్గా లేకపోవడంతో ఉత్పత్తిని, నిల్వలను తగ్గించుకునే దిశలో భాగంగా కూడా టొయోటా లాకౌట్‌ను ప్రకటించిందని, ఈ విషయంలో వెంటనే కర్నాటక ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Toyota Etios Cross

ఈ మేరకు కర్నాటక ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని సమర్పించామని కార్మిక సంఘ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు ప్లాంట్లలో 4,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 1,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో కార్మికుడికి వేతన పెంపు రూ.4,000 కోరుతున్నామని, కానీ, యాజమాన్యం మాత్రం రూ.3,050 మాత్రమే పెంచుతామని చెబుతోందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: అప్‌డేటెడ్ 2014 ఎతియోస్, లివా మోడళ్ల విడుదల

కాగా.. వేతనాల విషయంలో గడచిన 10 నెలలుగా కార్మికులతో చర్చలు జరుపుతున్నామని టొయోటా కిర్లోస్కర్ మోటార్ పేర్కొంది. అయితే, ప్రతిసారి ఇరు పక్షాల మధ్య చర్చలు విఫలం అవుతుండటంతో కర్నాటక లేబర్ విభాగం కూడా రంగంలోకి దిగిందని, ఏడుసార్లు త్రైమాసిక సమావేశాలు జరిగాయని, కానీ అన్నీ విఫలమయ్యాయని టికెఎమ్ తెలిపింది. అయితే, కార్మికులు చేస్తున్న విమర్శలపై స్పందించడానికి మాత్రం యాజమాన్యం నిరాకరించింది. ఇరు వర్గాల మధ్య సంప్రదింపులు జరుగుతున్న తరుణంలో, ఈ విమర్శలపై వ్యాఖ్యానించబోమని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్లలో కలిపి సాలీనా 3,10,000 వాహనాలు ఉత్పత్తి అవుతాయి. అయితే, గడచిన 25 రోజులుగా ఈ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని, ఒక వర్గం కార్మికులు కావాలనే ఉత్పత్తికి విఘాతం కలి గిస్తున్నారని టికెమ్ తెలిపింది. ఈ నేపథ్యంలో, ఇతర కార్మికులు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని లాకౌట్ ప్రకటిస్తున్నామని టొయోటా కిర్లోస్కర్ మోటార్ వివరించింది. ఇది ఇలానే కొనసాగితే, టొయోటా వాహనాలకు వెయిటింగ్ పీరియడ్ పెరిగే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motor Employees Union termed the lockout illegal and said it was suddenly declared without the mandatory 14-day notice to employees and intimation to the state labour office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X