లగ్జరీ బస్సుల్లో బ్లాక్ బాక్స్, స్పీడ్ లిమిటర్స్, సీట్ బెల్ట్స్!

By Ravi

ఇటీవలి కాలంలో విలాసవంతమైన బస్సులు (ఎక్కువగా వోల్వో) తరచూ ప్రమాదాలకు గురవుతుండటం, సదరు బస్సు నిర్వాహకులు ప్రయాణీకుల భద్రతను రోడ్డుపైనే వదిలేస్తుండటంతో, ఈ విషయాన్ని అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది.

ఇప్పటి వరకు విమాన రంగానికి మాత్రమే పరిమితమైన బ్లాక్ బాక్స్ (ప్రమాదానికి గల కారణాలు తెలియజేసే పరికరం) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇకపై విలాసవంతమైన బస్సులో కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.

బస్సు డిజైన్, రోడ్డు నిర్మాణం, డ్రైవర్ నిర్లక్ష్యాలే పాలెం వోల్వో బస్సు ప్రమాదానికి కారణాలు: సిఐడి

లగ్జరీ బస్సులలో బ్లాక్ బాక్సులతో పాటుగా సీట్ బెల్ట్స్ (ప్రతి సీటుకి), స్పీడ్ లిమిటర్స్ (నిర్దిష్ట వేగానికి మించి బస్సును నడపటానికి వీలు లేకుండా వేగాన్ని పరిమితం చేయటం)ను కూడా ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.


ఈనెలలో బెంగుళూరులో రవాణా మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న ఓ సమావేశంలో ఈ అంశాలను సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా అధికారులు, వోల్వో మరియు స్కానియా బస్సులను తయారు చేసే కంపెనీలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు.

బస్సులలో బ్లాక్ బాక్సును ఏర్పాటు చేయటం వలన బస్సు ఎంత వేగంతో వెళ్తుంది, ఒకే డ్రైవర్ ఎంత దూరం బస్సును నడిపాడు, బస్సులో డ్రైవర్ల సంభాషణ తదితర అంశాలు ఇందులో నమోదు అవుతాయి.

Scania DC Bus

ప్రతి సీటుకు సీట్ బెల్టును అమర్చడం ద్వారా కూడా ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం లగ్జరీ బస్సుల్లో ఎంపిక చేసిన రెండు మూడు సీట్లకు మాత్రమే సీట్ బెల్ట్స్ ఉంటున్నాయి.

ఇది కూడా చదవండి: డిసి స్టయిల్ 'స్కానియా సూపర్ లగ్జరీ బస్'

అనేక ప్రమాదాలకు మితిమీరిన వేగమే ప్రధాన కారణం కావటంతో, లగ్జరీ బస్సులు నిర్ధిష్ట వేగానికి మించి వెళ్లకుండా ఉండేలా ఉందులో వేగ పరిమితులను (స్పీడ్ లిమిటర్స్)ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Most Read Articles

English summary
To make high speed luxury bus travel safer authorities have come with a proposal to equip these buses with aircraft style black boxes and seat belts for every seat.
Story first published: Thursday, March 27, 2014, 8:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X