మహీంద్రా ఆటో క్విజ్ సీజన్ 6 ప్రారంభం, విజేతకు బంపర్ ప్రైజ్!

ఆటోమొబైల్స్ గురించి మీకు అవగాహన ఉండి, లక్ మీ వైపు ఉంటే మీరు ఉచితంగా మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారును గెలుచుకోవచ్చు. 'ఆటో క్వొషినెంట్' (Auto Quotient) పేరిట మహీంద్రా 6వ సీజన్ పోటీని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న 48 నగరాల్లో ఈ క్విజ్ ఛాలెంజ్ జరుగుతుంది. 18 ఏళ్ల వయస్సు నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన వారికి మాత్రమే ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

ఇది చూశారా..: మహీంద్రా ఆటోమోటివ్ ఫ్లాష్ మాబ్

మహీంద్రా నిర్వహిస్తున్న ఈ క్విజ్ ఛాలెంజ్ జులై 21, 2014వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఇందులో గెలిచిన మొదటి విజేతకు మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారును, రెండవ విజేతకు మహీంద్రా సెంచురో బైక్‌ను ఇవ్వటంతో పాటు పలు ఇతర బహుమతులు కూడా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. మహీంద్రా ఆటో క్వొషినెంట్ భారతదేశంలోనే ఈ తరహా ఆటో క్విజ్ కావటం విశేషం.

Mahindra Auto Quotient Season 6 Begins

మహీంద్రా నిర్వహిస్తున్న ఈ ఆటో క్వొషినెంట్ పోటీలో పాల్గొనదలిచిన అభ్యర్థులు http://www.mahindraaq.com లింక్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్విజ్‌కు సంబంధించిన అధికారిక ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ 'మహీంద్రా ఏక్యూ' ఫాలో అయ్యి, అందులో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం ద్వారా మహీంద్రా అందించే కానుకలు, ట్రీట్‌లను సొంతం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: వరల్డ్స్ బెస్ట్ లో కాస్ట్ ఎయిర్ లైన్స్

మహీంద్రా ఆటో క్వొషెనంట్ ఫైనలిస్టులను సిటీ రౌండ్స్ ద్వారా సెలక్ట్ చేయటం జరుగుతుంది. మొత్తం నాలుగు జోన్లలో వారు వ్రాత పరీక్షలో పోటీ పడాల్సి ఉంటుంది. ఇందులో చివరిగా ఫైనల్ స్టూడియో రౌండ్‌ను న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. ఇందులో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమం కోసం మహీంద్రా ఎన్డీటీవీ 24x7, ఎన్డీటీవీ ప్రాఫిట్ ఛానెళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ వీడియో చూశారా..? కెమెరామెన్ చావుకొచ్చిన ఫెరారీ డ్రిఫ్టింగ్
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/YyE1Qh1enZQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Mahindra has announced the commencement of their season 6 of 'Auto Quotient'. The quiz challenge will be held across 48 cities of India. There is an age limit for participants and they cannot be younger than 18 or older than 35.&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X