మహీంద్రా నుంచి 4 కొత్త ఎమ్‌పివి, ఎస్‌యూవీ మోడళ్లు

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరో నాలుగు కొత్త యుటిలిటీ వాహనాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే బొలెరో, స్కార్పియో, ఎక్స్‌యూవీ వంటి పాపులర్ మోడళ్లలో ఎస్‌యూవీ విభాగంలో మంచి బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పుడు మల్టీ పర్పస్ వెహికల్ (ఎమ్‌పివి) విభాగంలో తన బ్రాండ్ పవర్‌నను చూపించేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం ఎమ్‌పివి విభాగంలో మహీంద్రా కేవలం జైలోను మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఈ సెగ్మెంట్లోకి కొత్తగా ప్రవేశించిన మారుతి ఎర్టిగా, షెవర్లే ఎంజాయ్ వంటి మోడళ్ల నుంచి ఎదరవుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కంపెనీ కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఈ కొత్త వాహనాలను కంపెనీ సాఫ్ట్-రోడర్స్ లేదా యూవి-2 వెహికల్స్ అని పిలుస్తోంది.

Mahindra SUV

ఈ వాహనాల అభివృద్ధిలో మహీంద్రా అండ్ మహీంద్రా స్వాధీనం చేసుకున్న దక్షిణ కొరియాకు చెందిన శాంగ్‌యాంగ్ సహకారం తీసుకునే అవకాశం ఉంది. వినియోగదారులకు ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన వస్తువులను ఆఫర్ చేస్తూ, ఈ సెగ్మెంట్లోని పోటీదారులకు గట్టి సవాలు విసిరేలా ఈ కొత్త యుటిలిటీ వాహనాలను మహీంద్రా తయారు చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మహీంద్రా అందిస్తున్న యుటిలిటీ వాహనాలకు పూర్తి భిన్నంగా ఈ కొత్త వాహనాల డిజైన్ ఉంటుంది. ఈ కొత్త డిజైన్‌లకు ఇప్పటికే మహీంద్రా యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ప్రకటించినట్లు సమాచారం. కంపెనీ అధికారి పవన్ గోయెంకా ఓ ఆంగ్ల పత్రికకు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ కొత్త వాహనాలు 'ఫ్లాంబోయెంట్' వంటి యూరోపియన్ డిజైన్‌ను కలిగి ఉంటాయిని వ్యాఖ్యానించారు.

ఈ కొత్త వాహనాలలో ఓ ఎమ్‌పివిని శాంగ్‌యాంగ్ ఎక్స్100 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరో ఉత్పత్తిని ఎక్స్‌యూవీ500 ఆర్కిటెక్చ్ మీద అభివృద్ధి చేయనుండగా, మూడవది అప్‌డేటెడ్ జైలోగా ఉంటుందని సమాచారం.

Most Read Articles

English summary
It is no secret that Mahindra's strength lies in its traditional utility vehicles such as the Bolero & Scorpio. But the coming of popular models such as the Maruti Ertiga and Renault Duster has hurt the Indian SUV major. Mahindra calls these vehicles soft-roaders or UV-2, and the former UV-1.
Story first published: Saturday, February 15, 2014, 11:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X