నో డిమాండ్, నాలుగు రోజులు మహీంద్రా ప్లాంట్ బంద్

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) తమ ప్లాంట్‌లలో నాలుగు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. మహీంద్రా వాహనాలకు డిమాండ్ తక్కువగా ఉన్న కారణంగా, ఇప్పటికే స్టాక్ యార్డులలో ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎమ్ అండ్ ఎమ్‌కు భారతదేశంలో చాకన్, నాసిక్, హరిద్వార్‌లలో మూడు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఈ మూడు ప్లాంట్‌లలో కూడా నాలుగు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. ప్రస్తుత దేశీయ మార్కెట్ డిమాండ్‌కు తగినంత స్టాక్ ఇప్పటికే మహీంద్రా వద్ద ఉండటంతో, కంపెనీ కొద్దిరోజులు ఉత్పత్తిని నిలిపివేయనుంది.

Mahindra To Halt Production For Four Days

గడచిన జులై నెలలో మహీంద్రా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 9.91 శాతం పడిపోయి, 14,348 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో మహీంద్రా మొత్తం 15,927 వాహనాలను ఉత్పత్తి చేసింది. అంటే, కంపెనీ ఉత్పత్తి చేసిన వాహనాల కన్నా విక్రయించిన వాహనాల సంఖ్యే తక్కువ అన్నమాట.

ఈ ఏడాది ఏప్రిల్-జులై కాలానికి గమనిస్తే, మొత్తంగా మహీంద్రా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 6.91 శాతం క్షిణించి 66,528 యూనిట్లుగా నమోదైంది. ఇదే సమయంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం కూడా 7.09 శాతం తగ్గింది. ఈ సమయంలో కంపెనీ 71,212 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది.

Most Read Articles

English summary
Indian auto manufacturer Mahindra have planned to stop production for four days this month owing to low demand for their vehicles. All the plants, including their plant at Chakan will stop production for four days during the remaining period of this month.
Story first published: Monday, August 18, 2014, 17:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X