ఫార్ములా ఈలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న మహీంద్రా రేసింగ్

By Ravi

ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి సారిగా ఎలక్ట్రిక్ ఫార్ములా వన్ రేస్ కార్లతో జరగనున్న 'ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్' (Formula E Championship)లో పాల్గొనేందుకు ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 13, 2014వ తేదీన బీజింగ్‌లో జరగనున్న ఎఫ్ఐఏ ఫార్ములా ఈ చాంపియన్‌షిప్‌లో మహీంద్రా రేసింగ్ పాల్గొనబోతోంది.

ఫార్ములా ఈ రేసింగ్ సిరీస్‌లో పాల్గొనబోతున్న ఎనిమిదవ మరియు ఏకైక భారతీయ జట్టు ఇదే కావటం విశేషం. మహీంద్రా రేసింగ్ ఫార్ములా ఈ టీమ్‌లో మనదేశానికి చెందిన కరున్ చందాక్, బ్రెజిల్‌కు చెందిన బ్రూనో సెన్నాలు ప్రారంభ సీజన్ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ చాంపియన్‌ప్‌లో డ్రైవర్లుగా వ్యవహరించనున్నారు.


ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ రేసింగ్ సీజన్ బీజింగ్, లండన్, లాస్ ఏంజిల్స్‌తో కలిపి మొత్తం 10 రేస్‌లు నిర్వహించనున్నారు. ప్రారంభం సీజన్‌లో భాగంగా అన్ని రేస్ కార్లు ఒకే తయారీకి చెందినవి ఉంటాయి. అంటే, అన్ని రేస్ కార్లు డిజైన్ పరంగా, యాంత్రికపరంగా ఒకే విధంగా ఉంటాయన్నమాట. ఈ కార్లలో ఛాసిస్‌ను డల్లారా కంపెనీ నుంచి, బ్యాటరీ మరియు పవర్‌ట్రైన్‌ విలియమ్స్ కంపెనీ నుంచి గ్రహించారు. బాడీ డెవలప్‌‌మెంట్ మాత్రం స్పార్క్ రేసింగ్, రెనో సంస్థలు నిర్వహిస్తాయి.

రెండవ సీజన్ నుంచి మాత్రం ఎవరి రేసింగ్ కార్లను వారే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించనున్న ఫార్ములా ఈ రేస్‌లో మొత్తం 10 బృందాలు పాల్గొననున్నాయి. ప్రతి బృందంలో ఇద్దరు డ్రైవర్లు (ఎఫ్1 మాదిరిగా) ఉంటారు. గంట పాటు సాగే ఈ రేస్‌లో బ్యాటరీలు ఎక్కువ సేపు ఛార్జ్ ఉండవు కాబట్టి, మధ్యలో డ్రైవర్లు తమ కార్లను మార్చుకుంటుంటారు. ఫార్ములా ఈ రేసర్లు గరిష్టంగా గంటకు 217 కిలోమీటర్ల వేగంతో ఈ ఎలక్ట్రిక్ రేస్ కార్లను నడపగలరు.

Mahindra Formula E Championship

ప్రతి ఎలక్ట్రిక్ రేస్ కారు 25 నిమిషాల పాటు నడుస్తుంది. కానీ ప్రతి రేస్ దాదాపు గంటపాటు జరగాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి డ్రైవరుకు రేసుకు రెండు కార్ల చొప్పున ఇస్తారు. క్వాలిఫైయింగ్, రేస్ డే రెండింటినీ ఒకే రోజున నిర్వహిస్తారు. రెగ్యులర్ ఎఫ్1 రేసులను ప్రాక్టీస్ సెషన్. క్వాలిఫైయింగ్, రేస్ డే అని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం కుదరని వాళ్లు ఆ తేదీలలో స్టార్ స్పోర్ట్స్ 4, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డి 2 ఛానెళ్లలో వీక్షించవచ్చు.
Most Read Articles

English summary
As motor sports aficionados across the world get set to witness the first ever FIA Formula E championship, the world's first fully-electric racing series, the Mahindra Racing Formula E Team is ready to prove its mettle at the race. It is the eighth and the only Indian team to join the E racing series. India’s own Karun Chandhok and Brazil’s Bruno Senna are the team’s drivers for the inaugural season of the FIA Formula E Championship.
Story first published: Thursday, September 11, 2014, 16:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X