టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కిన 2014 మహీంద్రా స్కార్పియో

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న పాపులర్ ఎస్‌యూవీ 'మహీంద్రా స్కార్పియో'లో కంపెనీ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాయి. మహీంద్రా ఇప్పటికే ఈ మోడల్‌ను ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. టెస్టింగ్ దశలో ఉన్న స్కార్పియో ఫొటోలో డ్రైవ్‌స్పార్క్ కెమెరాకు చిక్కాయి.

ఇది కూడా చదవండి: సెప్టెంబర్ నెలలో 2014 స్కొడా యెటి విడుదల

ఈ స్పైషాట్స్‌ను మహీంద్రా స్కార్పియో బేసిక్ డిజైన్‌ను యధావిధిగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, ఫ్రంట్ డిజైన్, రియర్ డిజైన్ మరియు ఇంటీరియర్లలో అనేక మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. ఈ మార్పులలో ప్రధానంగా, కొత్త హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ బంపర్స్, రీస్టయిల్డ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త రియర్ బంపర్ అండ్ టెయిల్ గేట్ వంటి మార్పులను మనం 2014 స్కార్పియోలో గమనించవచ్చు.

Mahindra Scorpio

క్యాబిన్ లోపల కూడా రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, అప్‌మార్కెట్ ఫీల్‌నిచ్చే ఇంటీరియర్స్, కొత్త సెంటర్ కన్సోల్, కొత్త స్టీరింగ్ వీల్ వంటి మార్పులు ఇందులో ఉండే అవకాశం ఉంది. మహీంద్రా పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 నుంచి స్ఫూర్తి పొంది దీని ఇంటీరియర్స్‌ను డిజైన్ చేయవచ్చని సమాచారం.

ఇది కూడా చదవండి: అక్టోబర్ నాటికి ఫియట్ అవెంచురా క్రాసోవర్ విడుదల

ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌నే ఇందులోను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొత్త మహీంద్రా స్కార్పియోకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra India has been caught testing its latest version of the Scorpio. Here are a few images we found while driving around. We caught the SUV in camouflage and we managed to grab a few images of it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X