లక్ష యూనిట్ల సేల్స్ మార్క్‌ను తాకిన ఎక్స్‌యూవీ500

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమయిం ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ500' అప్పుడే 1,00,000 అమ్మకాల మార్కును చేరుకుంది. మార్కెట్లో విడుదలైన కేవలం 33 నెలలకే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఈ ఘనత సాధించింది.

భారతదేశంలో కెల్లా అతి తక్కువ సమయంలో లక్ష యూనిట్ల మార్కును చేరుకున్న ఎస్‌యూవీ కూడా ఇదే కావటం విశేషం. రూ.10-20 లక్షల సెగ్మెంట్లో లభిస్తున్న ఎస్‌యూవీలలో కెల్లా తమ ఎక్స్‌యూవీ500 అతివేగంగా వృద్ధిని సాధిస్తోందని కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవీణ్ షా తెలిపారు.

జనవరి 2013 నాటికే మహీంద్రా ఎక్స్‌‌యూవీ500 అమ్మకాలు 50,000 యూనిట్ల మార్కును చేరుకున్నాయి. ప్రారంభంలో ఈ మోడల్ కేవలం మూడు వేరియంట్లలో (డబ్ల్యూ6, డబ్ల్యూ8, డబ్ల్యూ8 ఆల్-వీల్ డ్రైవ్) మాత్రమే లభ్యమయ్యేది. కాగా కంపెనీ ఇందులో ఇటీవలే డబ్ల్యూ4 అనే ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను విడుదల చేసింది.

Mahindra XUV500

జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 3000 యూనిట్ల ఎక్స్‌యూవీ500 మోడళ్లు అమ్ముడయ్యాయి. ఈ త్రైమాసికంలో హై-ఎండ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మహీంద్రాకు 51 శాతం మార్కెట్ వాటా ఉండగా, ఎస్‌యూవీ సెగ్మెంట్లో 40 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ మోడల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్, రీడర్స్ ఛాయిస్ అవార్డ్, బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ కార్ అవార్ట్ వంటి 25 విభిన్న అవార్డులను గెలుచుకుంది. కంపెనీ ఇందులో ఓ ఆటోమేటిక్ మరియు హైబ్రిడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

Most Read Articles

English summary
The XUV 500, Mahindra's flagship model has sold 100,000 units in the Indian market. The company achieved this figure on Tuesday, 33 months after its launch.
Story first published: Friday, August 1, 2014, 10:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X