6 నెలలకు పెరిగిన మారుతి సెలెరియో వెయిటింగ్ పీరియడ్!

By Ravi

భారత కార్ మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో, మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న లేటెస్ట్ కార్ 'సెలెరియో' అమ్మకాలు మాత్రం యమ జోరుగా సాగుతున్నాయి. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) టెక్నాలజీతో మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త స్మాల్ కార్ 'సెలెరియో' (Celerio) అతి కొద్ది సమయంలో అత్యధిక పాపులరాటీని దక్కించుకుంది.

ఇది కూడా చదవండి: డాట్సన్ గో యాక్ససరీస్ ప్రైస్ లిస్ట్

మారుతి సుజుకి సెలెరియో కారుకు ఇప్పటికే 30,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. రోజురోజుకి ఈ మోడల్ బుకింగ్‌ల సంఖ్య మరింత పెరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మ్యాన్యువల్ వేరియంట్‌ను మించి ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ వేరియంట్) అమ్మకాలు ఎక్కువగా నమోదు కావటం. అంతేకాదు.. భారతదేశంలోనే తొలిసారిగా మ్యాన్యువల్ వేరియంట్ అమ్మకాలను ఆటోమేటిక్ వేరియంట్ అమ్మకాలు అధిమించడం కూడా ఇదే మొట్టమొదటిసారి.


సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిపోయింది. ప్రస్తుతం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ 3 నెలల వరకు ఉండగా, ఏఎమ్‌టి వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ 6 నెలల వరకు ఉంటోందని డీలర్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తర్వాత ఇంతటి అధిక వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి కారు మారుతి సుజుకి సెలెరియో కావటం విశేషం.

కేవలం ఏఎమ్‌టి వేరియంట్ సెలెరియోకి మాత్రమే కాకుండా, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన టాప్-ఎండ్ వేరియంట్ జెడ్ఎక్స్ఐకి కూడా ఎక్కువగానే బుకింగ్స్ వస్తున్నాయి. వాస్తవానికి మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన సెలెరియో మైలేజ్ మరియు ఏఎమ్‌టి కలిగిన సెలెరియో మైలేజ్ రెండూ ఒక్కటే (23.1 కెఎమ్‌పిఎల్). కాబట్టి కేవలం మైలేజీని మాత్రమే ప్రాధాన్యతనిచ్చే వారు ఈ రెండు వేరియంట్లలో దేనిని ఎంచుకున్న పెద్ద వ్యత్యాసం ఉండదు.

ఇది కూడా చూడండి: ఇలాంటి దొంగలు కూడా ఉంటారా?

అయితే, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని కోరుకునే వారు మాత్రం ఏఎమ్‌టి గేర్‌బాక్స్ కలిగిన సెలెరియోను ఎంచుకోవచ్చు. సాంప్రదాయ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్లతో పోల్చుకుంటే, వాటి కన్నా అత్యంత తక్కువ ధరకే ఈ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ కలిగిన సెలెరియో లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఈ మోడల్‌పై మక్కువ చూపుతున్నారు. ఈ కారుకు ప్రతిరోజు దేశవ్యాప్తంగా 1000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వస్తుంటే, అందులో సగానికి పైగా ఏఎమ్‌టి వేరియంట్‌లే ఉన్నట్లు సమాచారం.

Celerio Rear

గడచిన ఫిబ్రవరి నెలలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కాంపాక్ట్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించడంతో, మారుతి సుజుకి తమ సెలెరియో కారు ధరను కూడా భారీగా తగ్గించింది. తాజా తగ్గింపు తర్వాత మారుతి సుజుకి సెలెరియో బేస్ వేరియంట్ కేవలం రూ.3.76 లక్షలకే లభ్యమవుతోంది (ఇదివరకు ఈ వేరియంట్ ధర రూ.3.90 లక్షలుగా ఉండేది).

టాప్ ఎండ్ వేరియంట్ సెలెరియో (జెడ్ఎక్స్ఐ ఆప్షనల్) రూ.4.79 లక్షలకే లభ్యమవుతోంది (ఇదివరకు ఈ వేరియంట్ ధర రూ.4.96 లక్షలుగా ఉండేది). ఇకపోతే, ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో కూడిన ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.4.14 లక్షలు గాను మరియు విఎక్స్ఐ వేరియంట్ రూ.4.43 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). తాజా తగ్గిన ధర కూడా ఈ మోడల్ అమ్మకాల పెరుగుదలకు ఓ పెద్ద కారణంగా చెప్పవచ్చు.

సెలెరియోలో 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెలెరియో టాప్-ఎండ్ వేరియంట్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఓవిఆర్ఎమ్స్‌, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇది లీటరుకు 23.1 కి.మీ. మైలేజీనిస్తుంది (మ్యాన్యువల్/ఏఎమ్‌టి).

Most Read Articles

English summary
Maruti has done it again with the Celerio. At a time when car sales are declining and discounts are being offered on most models, including on those sold by Maruti Suzuki itself, the company has come out with the Celerio that's defying all odds, selling better than anyone expected.
Story first published: Tuesday, March 18, 2014, 16:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X