మారుతి సుజుకి మార్కెటింగ్ ఛీఫ్ మయాంక్ పారీక్ రాజీనామా

By Ravi

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ ఛీఫ్ మయాంక్ పారీక్ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు రెండు దశాబ్ధాలు మారుతి సుజుకి సంస్థలో వివిధ విభాగాల్లో సేవలు అందించిన మయాంక్ పారీక్, ఇకపై ఆ సంస్థకు గుడ్‌బై చెప్పేశారు.

మారుతి సుజుకి బ్రాండ్‌ను ప్రజల్లోకి తీసుకవెళ్లటంలో మయాంక్ పారీక్ చేసిన కృషి కొనియాడదగినది. హఠాత్తుగా మయాంక్ పారీక్ తన పదవికి రాజీనామా చేయటం వెనుక ఉన్న కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఈయన టాటా మోటార్స్ కంపెనీలో చేరవచ్చే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మారుతి సుజుకి ఇండియా ఉన్నాతాధికారి ఒకరు మయాంక్ పారీక్ రాజీనామాను ధృవీకరించారు. మారుతి సుజుకి బ్రాండ్‌ను గ్రామీణ మార్కెట్లకు చేరువ చేయటంలో పారీక్ విజయం సాధించాడు. స్విఫ్ట్, డిజైర్, ఎస్టిలో మొదలైన మోడళ్ల విజయానికి కారకులలో పారీక్ కూడా ఒకరు.

Maruti Suzuki India Marketing Chief Quits

ఇటీవలే కాలంలో, మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ కొన్ని కీలక విభాగాల్లో (మానవ వనురలతో కలిపి) కఠినంగా వ్యవరిస్తున్నట్లు సమాచారం. ఇది కూడా అతని రాజీనామాకు ఓ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

మయాంక్ పారీక్ 1991లో మారుతి సుజుకి కంపెనీలో చేరారు. ఆయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి బి.టెక్ మరియు ఐఐఎమ్ బెంగుళూరు నుంచి ఎమ్‌బిఏ పూర్తి చేశారు. 2003లో పారీక్ మారుతి సుజుకి సేల్స్ ఛీఫ్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మారుతి సుజుకి ఇండియాకు భారత కార్ మార్కెట్లో 45 శాతం మార్కెట్ వాటా ఉంది.

Most Read Articles

English summary
India's largest car manufacturer, Maruti, has just lost a very valuable asset, their Marketing Chief, Mayank Pareek. Pareek worked with Maruti for over two decades before putting down his papers. He was known as the face of Maruti. It was under his reign that the company reached its peak in terms of sales in the last five years.
Story first published: Wednesday, September 17, 2014, 12:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X