2015లో మారుతి సుజుకి ఎల్‌సివి విడుదల

By Ravi

ప్యాసింజర్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియా, ఇప్పుడు తేలికపాటి వాణిజ్య వాహనాల తయారీపై కన్నేసింది. వచ్చే ఏడాదిలో కంపెనీ 2 టన్నుల కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన ఓ ఎల్‌సివి (లైట్ కమర్షియల్ వెహికల్)ను విడుదల చేయాలని యోచిస్తోంది. మారుతి సుజుకి మాతృ సంస్థ, జపాన్‌కి చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ అందిస్తున్న 'క్యారీ' (Carry) ఎల్‌సివి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ కొత్త ఎల్‌సివి అభివృద్ధి చేయనున్నారు.

ఇది కూడా చదవండి: మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ లిమిటెడ్ ఎడిషన్

ఇప్పటికే మారుతి సుజుకి ఈ ఎల్‌సివిని 'వై9టి' (Y9T) అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తోంది. కాగా.. మారుతి సుజుకి తమ కొత్త ఎల్‌సివికి ఇంకా ఓ పేరును ఖరారు చేయలేదు. క్యారీ పేరుతోనే ఈ కొత్త ఎల్‌సివిని విక్రయిస్తుందా లేక వేరే పేరును ప్రతిపాదిస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇది ఈ సెగ్మెంట్లో ప్రధానంగా టాటా ఏస్‌కు పోటీగా నిలువనుంది. అలాగే మహీంద్రా జియో, పియాజ్జియో ఆపే ట్రక్, అశోక్ లేలాండా దోస్త్, ఫోర్స్ మోటార్స్ ట్రంప్ వంటి మోడళ్లకు సైతం పోటీ ఇవ్వనుంది.

Maruti Suzuki Carry LCV

మారుతి సుజుకి తమ ఎల్‌సివిలో తాజాగా అభివృద్ధి చేసిన 0.8 లీటర్ ట్విన్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్‌ను సుజుకి జపాన్‌లో అభివృద్ధి చేస్తోంది. మారుతి వై9టి ఎల్‌సివిలో ఉపయోగించడానికి ముందుగా దీనిని అక్కడే టెస్ట్ చేసి, రిలీజ్ చేయనున్నారు. దీనిని కేవలం ఎల్‌సివిలోనే కాకుండా, ప్యాసింజర్ కార్లలో కూడా ఉపయోగించేందుకు వీలుగా తయారు చేయనున్నారు. ఇందులో భాగంగా దీని ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) లెవల్స్ స్థాయిల తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

ఇది కూడా చదవండి: మారుతి సెలెరియో వెయిటింగ్ పీరియడ్ ఎంత?

మారుతి సుజుకి వై9టి ఎల్‌సివి కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తోనే కాకుండా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన సిఎన్‌జి వేరియంట్లో కూడా విడుదల కానున్నట్లు సమాచారం. ఈ ఎల్‌సివి జపాన్‌లోని సుజుకి క్యారీ మోడల్ ఆధారంగా చేసుకొని తయారు చేస్తుప్పటికీ, ఇండియన్ మార్కెట్‌కు అనుగుణంగా దీనిని డిజైన్ చేయనున్నారు. దీనిని గుర్గావ్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నారు. డీజిల్ వెర్షన్ ధర రూ.4 లక్షల రేంజ్‌లో, సిఎన్‌జి వెర్షన్ ధర రూ.4.5-5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Maruti Suzuki will enter commercial vehicle segment in India next year with a new sub-2 tonne truck that will be based on the Suzuki Carry. The said mini truck is known only by its codename ‘Y9T' as of now since Maruti Suzuki is yet to decide on a commercial name.
Story first published: Tuesday, March 18, 2014, 9:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X