35000 యూనిట్లను దాటిన సెలెరియో అమ్మకాలు
By Ravi
మారుతి సుజుకి ఇటీవలే విడుదల సెలెరియో హ్యాచ్‌బ్యాక్ అతి తక్కువ కాలంలోనే మంచి సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసినదే. సెగ్మెంట్లో కెల్లా మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌, సరమైన ధర, మోడ్రన్ డిజైన్, బెస్ట్ ఇన్ క్లాస్ స్పేస్, బెస్ట్ ఇన్ సెగ్మెంట్ మైలేజ్, తిరుగులేని మారుతి బ్రాండ్ ఇమేజ్ వంటి పలు అంశాలు ఈ కారు సక్సెస్‌కు సోపానాలుగా చెప్పుకోవచ్చు.
ఇప్పటి వరకు మారుతి సుజుకి ఇండియా మొత్తం 35,000 యూనిట్ల సెలెరియో కార్లను విక్రయించినట్లు ప్రకటించింది. త్వరలోనే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: 6 నెలలకు పెరిగిన మారుతి సెలెరియో వెయిటింగ్ పీరియడ్!
గడచిన ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి తమ సెలెరియో కారును రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. రాష్ట్ర విపణిలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగిన సెలెరియో ధరలు రూ.4.02 లక్షల నుంచి రూ.5.10 లక్షల రేంజ్‌లో ఉండగా, ఈజీ డ్రైవ్ ఆటో గేర్ షిఫ్ట్ కలిగిన సెలెరియో ధరలు రూ.4.43 లక్షల నుంచి రూ.4.73 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).
సెలెరియోలో 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ మరియు ఏఎమ్‌టి వెర్షన్ మారుతి సెలెరియో కార్లు రెండూ లీటరు పెట్రోలుకు 23.1 కిలోమీటర్ల మైలేజీనిస్తాయని కంపెనీ పేర్కొంది.
Celerio Blue
మారుతి సుజుకి సెలెరియో ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న బ్లేజింగ్ రెడ్, పెరల్ ఆర్కిటిక్ వైట్, గ్లిస్టెనింగ్ గ్రే, సిల్కీ సిల్వర్ కలర్లతో పాటుగా, మరో మూడు ఆకర్షనీమైన రంగుల్లో లభిస్తుంది. అవి - సన్‌షైన్ రే, సెరులియన్ బ్లూ, కేవ్ బ్లాక్. సెలెరియో టాప్-ఎండ్ వేరియంట్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఓవిఆర్ఎమ్స్‌, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్లు లభ్యం కానున్నాయి.
Post by DriveSpark.
Most Read Articles
English summary
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X