మారుతి సుజుకి సియాజ్ ఉత్పత్తి షురూ, త్వరలో విడుదల

By Ravi

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి తొలిసారిగా పరిచయం చేసిన 'సియాజ్' (Ciaz) సెడాన్‌ను మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి రానున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, సరికొత్త సియాజ్ సెడాన్ ఉత్పత్తిని మారుతి సుజుకి ఇప్పటికే తమ మానేసర్ ప్లాంట్ ప్రారభించినట్లు సమాచారం. మారుతి సియాజ్‌కు మంచి డిమాండ్ ఏర్పడవచ్చనే ఉద్దేశ్యంతో, కంపెనీ ముందుగానే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది.

సియాజ్ సెడాన్‌ను 'ఎస్ఎక్స్4'కు రీప్లేస్డ్ వెర్షన్‌గా ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, మారుతి సుజుకి ఇప్పటికే ఈ పాత మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది. సెప్టెంబర్ ద్వితీయార్థం నాటికి మారుతి సుజుకి సియాజ్ దేశీయ విపణిలో వాణిజ్య పరంగా విడుదల కావచ్చని తెలుస్తోంది.

Maruti Suzuki Ciaz

మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లోని హోండా సిటీ, ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వెంటో వంటి కార్లకు గట్టి పోటీనిచ్చేలా మారుతి సుజుకి తమ సియాజ్ సెడాన్‌ను మోడ్రన్‌గా డిజైన్ చేసింది. ఇదివరకటి మారుతి ఎస్ఎక్స్4 సెడాన్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో కంపెనీ ఈ కారును అభివృద్ధి చేశారు.

వాస్తవానికి ఇది ఎస్ఎక్స్‌4 సెడాన్ రీప్లేస్‌మెంట్ మోడల్ అయినప్పటికీ, పాత ఎస్ఎక్స్4 సెడాన్‌కు ఈ కొత్త సియాజ్ సెడాన్‌కు మధ్య ఎలాంటి పోలిక ఉండదు. కొత్త క్రోమ్-ఫినిష్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన బంపర్స్, కొత్త హెడ్‌ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి డిజైన్ మార్పులను ఈ కారులో గమనించవచ్చు. అలాగే, ఇంటీరియర్స్ మరియు టెక్నాలజీ ఫీచర్లలో కూడా చెప్పుకోదగిన మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఇంజన్ ఆప్షన్స్ గురించి మాత్రం ఇంకా స్పష్టమైన సమచారం లేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti Suzuki is all set to launch its latest mid-sized sedan Ciaz in India. According to reports, Maruti Suzuki has already started the production of Ciaz at Manesar manufacturing facility in Haryana.
Story first published: Tuesday, August 19, 2014, 12:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X