త్వరలో రిఫ్రెష్డ్ 2014 మారుతి సుజుకి స్విఫ్ట్ విడుదల

By Ravi

ప్రస్తుతం భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులలో రిఫ్రెష్డ్ మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. ఇప్పటి ఫోక్స్‌వ్యాగన్ తమ సరికొత్త 2014 పోలో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయగా, ఫియట్ తమ కొత్త 2014 పుంటో ఇవో హ్యాచ్‌బ్యాక్‌ను హ్యుందాయ్ తమ పాపులర్ ఐ20లో ఎలైట్ ఐ20 పేరిట రిఫ్రెష్డ్ వెర్షన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే.

ఇది కూడా చదవండి: 2014 ఫియట్ పుంటో ఇవో విడుదల, ధరలు

ఇదే కోవలో దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌లో రిఫ్రెష్డ్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుతి సుజుకి తొలిసారిగా 2005లో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. రెండేళ్ల క్రితం ఈ మోడల్‌లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను మారుతి సుజుకి విడుదల చేసింది.


తాజాగా మరోసారి అప్‌డేట్ కానున్న 2014 స్విఫ్ట్‌లో కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉంటాయని, మెకానికల్ మార్పులు ఉండవని సమాచారం. ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ (విత్ టర్న్ ఇండికేటర్స్), రీడిజైన్డ్ సెంటర్ మౌంటెడ్ రియర్ బ్రేక్ లైట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ వంటి పలు కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఈ కారులో ఉండనున్నాయి.

ఇంటీరియర్స్‌లో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త స్విఫ్ట్‌‌లో స్టార్ట్/స్టాప్ బటన్, బ్లూటూత్‌తో కూడిన ఆడియో సిస్టమ్, డ్యూయెల్ టోన్ అప్‌హోలెస్ట్రీ వంటి మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి తమ స్విఫ్ట్ ఫేస్‌‌లిఫ్ట్‌ను ఈ ఏడాది పండుగ సీజన్‌లోనే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Maruti Suzuki Swift

కొత్త 2014 స్విఫ్ట్‌లోని ఇంజన్స్ విషయానికి వస్తే, ప్రస్తుత స్విఫ్ట్‌లో ఉపయోగిస్తున్న 1.2 లీటర్, 4-సిలిండర్ 87 హార్స్‌పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్, 4-సిలిండర్ 75 హార్స్‌పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ డీజిల్ ఇంజన్లనే ఈ కొత్త స్విఫ్ట్‌లోను ఉపయోగించనున్నారు.

పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో స్టాండర్డ్‌గా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేసినప్పటికీ, సెలెరియోలో ఆఫర్ చేసినట్లుగా కొత్త స్విఫ్ట్‌లో కూడా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ని ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Volkswagen India was the first to introduce its 2014 Polo. It was followed by the Italian Fiat, who launched their 2014 Punto Evo. The latest launch was that by South Korean automobile giant Hyundai and their Elite i20. These vehicles will compete head on with the soon to be launched Maruti Suzuki Swift refreshed model.
Story first published: Wednesday, August 20, 2014, 12:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X