సెలెరియో ఏఎమ్‌టి ఉత్పత్తిని పెంచనున్న మారుతి

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన చిన్న కారు 'సెలెరియో' మోడల్‌కు ఉత్పత్తికి మించి డిమాండ్ ఉంటున్న సంగతి తెలిసినదే. ఇది ప్యాసింజర్ కార్లలో మొట్టమొదటి సారిగా ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో లభిస్తున్న కారు కావటంతో కొనుగోలుదారులు ఎక్కువగా ఈ వేరియంట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

దీంతో మ్యాన్యువల్ వెర్షన్‌తో పోటీగా ఏఎమ్‌టి వెర్షన్‌కు బుకింగ్స్ వస్తున్నాయి. ఫిబ్రవరి 2014 నుంచి ఇప్పటి వరకు మారుతి సెలెరియో కోసం 57,800 బుకింగ్‌లు రాగా ఇందులో దాదాపు 43 శాతం (25000 యూనిట్లు) ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన వేరియంట్లంటేనే ఈ టెక్నాలజీ ఎంత సక్సెస్ అయిందో ఇట్టే అర్థమైపోతుంది.

Maruti Suzuki Celerio

సెలెరియో ఏఎమ్‌టి వేరియంట్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, మారుతి సుజుకి ఈ వేరియంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచి తద్వారా దీని వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించాలని భావిస్తోంది. ఇదివరకు నెలకు 4500 యూనిట్లకుగా ఉన్న సెలెరియో ఏఎమ్‌టి ఉత్పత్తిని కంపెనీ 6500 యూనిట్లకు పెంచనుంది.

ప్రస్తుతం మార్కెట్లో సెలెరియో ఏఎమ్‌టి ధరలు రూ.4.14 లక్షల నుంచి రూ.4.43 లక్ష్యలో మధ్యలో ఉండగా, మ్యాన్యువల్ వెర్షన్ ధరలు రూ.3.76 లక్షల నుంచి రూ.4.78 లక్షల మధ్యలో ఉన్నాయి. కాగా.. కంపెనీ ఇటీవలే ఇందులో సిఎన్‌జి వేరియంట్‌ను కూడా రూ.4.68 లక్షల ధరతో మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Most Read Articles

English summary
The Celerio AMT by Maruti Suzuki has been an instant hit with the Indian buyers. Maruti had increased monthly production of Celerio with AMT option to 6,500 units now from about 4,500 units when it was launched.
Story first published: Monday, July 28, 2014, 12:57 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X