కొత్త మారుతి ఆల్టో కె10లో ఏఎమ్‌టి; వచ్చే నెలలో విడుదల

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న నెంబర్ వన్ కారు ఆల్టో బ్రాండ్‌లో లభిస్తున్న 1000సీసీ వెర్షన్ 'ఆల్టో కె10'లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాం. కాగా.. ఇప్పుడు ఇదే విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

ఈ కొత్త మారుతి ఆల్టో కె10 వచ్చే నెలలోనే విడుదల కానుంది. సరికొత్త డిజైన్‌ మరియు ఫీచర్లతో రానున్న కొత్త ఆల్టో కె10లో, కంపెనీ విక్రయిస్తున్న సెలెరియోలో ఆఫర్ చేస్తున్న ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)ని కూడా ఆఫర్ చేయనున్నారు. అంతేకాకుండా.. సెలెరియోలో ఉపయోగిస్తున్న రీట్యూన్డ్ 1 లీటర్ కె-సిరీస్ ఇంజన్ కూడా కొత్త ఆల్టో కె10లో ఉపయోగించనున్నారు.

new maruti alto k10

ఆల్టో కె10 తమకు చాలా ముఖ్యమైన ఉత్పత్తి అని, ఈ సెగ్మెంట్లో కస్టమర్ డిమాండ్ ఎక్కువగా ఉందని, ధరకు తగిన విలువతో ఎక్కువ ఫీచర్లు కలిగిన కారును వారి ఆశిస్తుంటారని, ఇలాంటి కస్టమర్ల అంచనాలను చేరుకోవటం ఎల్లప్పుడూ సవాలుగానే ఉంటుందని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎర్ఎస్ కల్సి తెలిపారు.

ఈ నేపథ్యంలో తమ ఇంజనీర్లు ఈ సవాళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్ని కొత్త ఆల్టో కె10 కోసం శ్రమించారని ఆయన చెప్పారు. కాగా, మారుతి సెలెరియో తర్వాత ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) సౌకర్యంతో వస్తున్న రెండవ మారుతి వాహనం ఈ కొత్త ఆల్టో కె10. ఈ కొత్త కారు ధర కస్టమర్లు మెచ్చే విధంగానే ఉంటుందని మారుతి సుజుకి చెబుతోంది.

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మోడల్ పెట్రోల్ వెర్షన్ కారు లీటరుకు 24.07 కిలోమీటర్ల మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ కిలోకి 32.26 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కల్సి వివరించారు. కొత్త ఆల్టో కె10 ఆరు విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది. ఏఎమ్‌టి వెర్షన్ మాత్రం కేవలం టాప్-ఎండ్ వేరియంట్‌లోనే లభ్యం కానుంది. నవంబర్ 2014లో ఇది విడుదల కానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti Suzuki India will launch a new version of its Alto K10 equipped with automated gear shift next month. After the Celerio, the Alto K10 will be the second model to be equipped with auto gear shift (AGS) feature.
Story first published: Thursday, October 23, 2014, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X