వ్యాగన్ఆర్ ఏఎమ్‌టిని విడుదల చేయనున్న మారుతి సుజుకి

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ప్యాసింజర్ కార్లలో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌ను తమ సెలెరియో కారు ద్వారా పరిచయం చేసిన సంగతి తెలిసినదే. ఈ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ కంపెనీ ఊహించిన దాని కన్నా ఎక్కువ ప్రాచుర్యం పొందటంతో, కంపెనీ అందిస్తున్న మరిన్ని ఇతర మోడళ్లలో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు తెలుగు డ్రైవ్‌‍స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించింది.

ఇటీవలే మారుతి తమ కొత్త ఆల్టో 10కె మోడల్‌లో ఏఎమ్‌టి వేరియంట్‌ను పరిచయం చేసింది. ఇక నుంచి మారుతి నుంచి మూడవ ఏఎమ్‌టి వేరియంట్ వ్యాగన్ఆర్. మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 5 మోడళ్లలో ఒకటైన వ్యాగన్ఆర్ కారులో ఏఎమ్‌టిని పరిచయం చేస్తే, ఈ మోడల్ అమ్మకాలు మరింత పుంజుకునే ఆస్కారం ఉంది.

మారుతి సుజుకి తమ ఎంట్రీ లెవల్ కార్లలో ఈ అధునాతన ఏఎమ్‌టి టెక్నాలజీని పరిచయం చేయటం ద్వారా ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని యోచిస్తోంది.

Maruti Suzuki To Launch WagonR AMT Soon

అటు పూర్తి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లోని సౌకర్యాన్ని మరియు ఇటు మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో సమానమైన మైలేజీని ఇవ్వగలగటం ఈ ఏఎమ్‌టి ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) యొక్క ప్రధాన లక్షణం. అంతేకాదు.. సాంప్రదాయ (ఫుల్లీ) ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్లతో పోల్చుకుంటే, ఈ ఏఎమ్‌టి ట్రాన్సిమిషన్ కలిగిన కార్లు అత్యంత సరమైన ధరకే లభించడం కూడా ఏఎమ్‌టి పాపులారిటీ మరో పెద్ద కారణంగా చెప్పుకోవచ్చు.

కొత్త మారుతి వ్యాగన్ఆర్ ఏఎమ్‌టి మోడల్‌లో కూడా రిఫ్రెష్డ్ 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉంది. సెలెరియో, కొత్త ఆల్టో కె10 మోడళ్లలో ఉపయోగించిన ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను మ్యాన్యువల్ లేదా ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
After the sucess of AMT equipped Celerio, Alto K10 now Maruti Suzuki is reportedly readying the AMT equipped Wagon R for India market.
Story first published: Friday, November 21, 2014, 15:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X