69,555 డీజిల్ కార్లను రీకాల్ చేయనున్న మారుతి సుజుకి

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తాజాగా మరో రీకాల్‌ను ప్రకటించింది. వైరింగ్ హార్‌నెస్ రూటింగ్ (కారులోని ఎలక్ట్రిక్ కేబుళ్ల రూటింగ్)లో సమస్య కారణంగా మొత్తం 69,555 డీజిల్ కార్లను రీకాల్ చేయనున్నామని కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

మార్చ్ 8, 2010వ తేది నుంచి ఆగస్ట్ 11, 2013 మధ్య కాలంలో తయారైన 55,938 యూనిట్ల డిజైర్ (పాత మోడల్) సెడాన్లు, 12,486 యూనిట్ల స్విఫ్ట్ (పాత మోడల్) హ్యాచ్‌బ్యాక్‌లు మరియు 1,131 యూనిట్ల రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా తెలిపింది.

పైన తెలిపిన సమయంలో తయారైన డీజిల్ వాహనాలకు మాత్రమే ఈ రీకాల్ వర్తిస్తుందని, ఇతర వాహనాలు కానీ లేదా ఎగుమతి చేసిన కార్లు కానీ ఈ రీకాల్‌కు వర్తించవని కంపెనీ పేర్కొంది. తమ డీలర్లు ఈ సమస్యకు గురైన కార్ల యజమానులను గుర్తించి, వారిని సంప్రదించడం జరుగుతుందని మారుతి తెలిపింది.

Maruti Suzuki Recall

రీకాలస్‌కు వర్తించే కార్లను డీలర్‌షిప్‌కు తీసుకువస్తే, అక్కడి వర్క్‌షాప్ టెక్నీషియన్లు ఉచితంగా ఈ లోపాన్ని తనిఖీ చేసి, సరిచేస్తారని కంపెనీ తెలిపింది. కంపెనీ ద్వారా ఇంటర్నల్ చెక్స్ చేయటం మరియు ఫీడ్‌బ్యాక్‌ను పర్యవేక్షించడం ద్వారా ఈ సమస్యను తాము గుర్తించామని మారుతి సుజుకి వివరించింది.

పాత డిజైర్, పాత స్విఫ్ట్ మరియు రిట్జ్ కార్లను ఉపయోగించే వాహన యజమానులు కంపెనీ వెబ్‌సైట్ (http://www.marutisuzuki.com)ను సందర్శించి, తమ వాహన ఛాస్సిస్ నెంబర్‌ను (MA3 లేదా MBH తర్వాత 14 అక్షరాలు-సంఖ్యలతో కూడిన నెంబరు) నమోదు చేసి, తమ కారు కూడా రీకాల్‌కు వర్తిస్తుందో లేదో తెలుసుకోవచ్చు.

Most Read Articles

English summary
Maruti Suzuki India Limited today announced that it will proactively inspect and repair the wiring harness fitment of 69,555 diesel vehicles (55,938 units of Old Dzire, 12,486 units of Old Swift and 1,131 units of Ritz) manufactured between 8th March 2010 and 11th August 2013.
Story first published: Tuesday, September 30, 2014, 17:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X