కార్జాన్‌రెంట్ నుంచి 120 మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ కార్లకు ఆర్డర్

మెర్సిడెస్ బెంజ్ ఇండియాకు ఓ ప్రముఖ క్యాబ్ సేవల కంపెనీ నుంచి భారీ ఆర్డర్ లభించింది. భారతదేశపు ప్రముఖ పర్సనల్ గ్రౌండ్ ట్రాన్స్‌పోర్టేషన్ సొల్యూషన్ కంపెనీ కార్జాన్‌రెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సిఐపిఎల్) 120 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ లగ్జరీ సెడాన్ల కోసం ఆర్డర్ చేసింది. లగ్జరీ కార్లలో ఈ డీల్ భారతదేశంలో కెల్లా అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ కార్పోరేట్ డీల్ కావటం విశేషం.

అంతేకాకుండా.. ఈ 120 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కార్ల చేరికతో, భారతదేశంలో కెల్లా అత్యధిక సంఖ్యలో లగ్జరీ కార్లను కలిగిన ఉన్న కంపెనీ కార్జాన్‌రెంట్ కూడా అగ్రస్థానంలో నిలిచింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎబర్‌హార్డ్ కెర్న్ చేతుల మీదురగా కార్జాన్‌రెంట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ విజ్ ఈ లగ్జరీ సెడాన్లను అందుకున్నారు.

Mercedes Benz C Class Carzonrent

యువ భారతీయులలో పెరుగుతున్న సంపద మరియు సౌకర్యవంతమైన, విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే కస్టమర్ల సంఖ్య పెరుగుతుండటంతో లగ్జరీ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ సేవలను అందించే కార్జాన్‌రెంట్ కంపెనీ నుంచి లగ్జరీ ట్రాన్స్‌పోర్ట్ కోరుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుండటంకో సదరు కంపెనీ ఇంత భారీ సంఖ్యలో కార్లను ఆర్డర్ చేసింది.

కార్జాన్‌రెంట్ తమ వ్యాపార విస్తరణలో భాగంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. కార్జాన్‌రెంట్ దేశవ్యాప్తంగా ఉన్న 39 ప్రధాన నగరాల్లో, 100కు పైగా లొకేషన్లలో సేవలు అందిస్తోంది. వచ్చే 2017 కంపెనీ తమ మొత్తం కార్ల సంఖ్యను 30,000లకు పెంచుకోవాలని యోచిస్తోంది.

Most Read Articles

English summary
Carzonrent India Pvt. Ltd (CIPL), India’s leading personal ground transportation solutions company, today announced the single largest luxury car order from Mercedes-Benz India. Carzonrent has acquired 120 Mercedes-Benz C-Class luxury sedans, making it the single largest corporate fleet deal in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X