2015 మెర్సిడెస్ మేబ్యాక్ లగ్జరీ కార్ ఆవిష్కరణ

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్, గతంలో నిలిపివేసిన తమ మేబ్యాక్ బ్రాండ్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఇటీవలే సరికొత్త మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్600 మోడల్‌కి సంబంధించిన ఓ టీజర్, ఇంటీరియర్ ఫొటోని విడుదల చేసిన కంపెనీ, తాజాగా ఈ కారు పూర్తి ఫొటోలను విడుదల చేసింది.

ప్రస్తుతం యూఎస్‌లో జరుగుతున్న లాస్ ఏంజిల్స్ ఆటో షో మరియు చైనాలో జరుగుతున్న గాంగ్జౌ ఆటో షోలలో మెర్సిడెస్ తమ మేబ్యాక్ కారును ప్రదర్శనకు ఉంచింది. ఈ సరికొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ కారును కంపెనీ విక్రయిస్తున్న ఎస్600 (ఎస్-క్లాస్) మోడల్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు. అత్యంత విలాసవంతమైన ఫీచర్లతో ఈ కారును రూపొందించారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2015 మెర్సిడెస్ మేబ్యాక్ లగ్జరీ కార్ ఆవిష్కరణ

మెర్సిడెస్ బెంజ్ 2012వ సంవత్సరంలో తమ మేబ్యాక్ బ్రాండ్ ఉత్పత్తిని నిలిపివేసింది. మెర్సిడెస్ తమ సబ్-బ్రాండ్‌గా మేబ్యాక్ కార్లను విక్రయించేది. కాగా.. ఇప్పుడు తాజాగా దాదాపు రెండేళ్ల తర్వాత తమ మేబ్యాక్ బ్రాండ్‌‌కు తిరిగి జీవం పోసింది.

2015 మెర్సిడెస్ మేబ్యాక్ లగ్జరీ కార్ ఆవిష్కరణ

మెర్సిడెస్ మేబ్యాక్ కార్లు సంపన్నుల కోసం తయారు చేయబడేవి, ఇవి ఇతర మెర్సిడెస్ కార్ల కన్నా ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.

2015 మెర్సిడెస్ మేబ్యాక్ లగ్జరీ కార్ ఆవిష్కరణ

మేబ్యాక్ కార్లలో ధరకు తగినట్లుగానే విలాసాలు కూడా అందుబాటులో ఉంటాయి (ఈ ఇంటీరియర్ ఫొటో చూస్తేనే అర్థమవుతుంది).

2015 మెర్సిడెస్ మేబ్యాక్ లగ్జరీ కార్ ఆవిష్కరణ

మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్600 కారులో 6.0 లీటర్, వి12 ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 530 హార్స్‌పవర్‌ల శక్తిని, 830 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Mercedes-Maybach had earlier this week announced that it would be launching an all new S-Class. They have globally unveiled the stretched out S-Class at Los Angeles Auto Show and Guangzhou Auto Show. The unveil was held in China and United States almost simultaneously.
Story first published: Saturday, November 22, 2014, 15:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X