క్యాబ్ వాలెట్‌తో కూడిన మెరూ క్యాబ్ మొబైల్ అప్లికేషన్

By Ravi

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ మెరూ క్యాబ్స్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ఓ సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను తయారు చేసింది. ఈ అప్లికేషన్ సాయంతో కస్టమర్లు వారం రోజుల ముందుగానే తమ క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, తమకు కేటాయించ్ క్యాబ్‌ను ఎక్కడుందో కూడా ట్రేస్ చేసుకోవచ్చు. దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో, తమ సేవలను మరింత సులభతరం చేసేందుకే ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని కంపెనీ పేర్కొంది.

ఈ అప్లికేషన్ ద్వారా కేవలం క్యాబ్‌ను బుక్ చేసుకోవటం, లొకేషన్‌ను ట్రాక్ చేసుకోవటమే కాకుండా క్యాబ్‌కు అయిన మొత్తాన్ని కూడా మొబైల్ ఫోన్ ద్వారానే చెల్లించవచ్చు. ఇందుకోసం మెరూ క్యాబ్స్ క్యాబ్ వాలెట్ సిస్టమ్‌ను పరిచయం చేసింది. భారతదేశంలోనే మొట్టమొదటి క్యాబ్ వాలెట్ సిస్టమ్ అయిన ఈ సదుపాయాన్ని సిట్రస్ పే భాగస్వామ్యంతో మెరూ క్యాబ్స్ డెవలప్ చేసింది.

meru cab launch new app

స్మార్ట్ ఫోన్లలో ఈ అప్లికేషన్‌ను వినియోగించే క్యాబ్ యూజర్లు తమ క్రెడిట్, డెబిట్ లేదా నెట్ బ్యాంకింగ్ సాయంతో క్యాబ్ వాలెట్‌లో కొంత మొత్తాన్ని ముందుగా బదిలీ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాబ్ ప్రయాణించిన దూరానికైన మొత్తాన్ని నగదు రూపంలో కాకుండా ఒక్క క్లిక్ సాయంతో ఈ మొబైల్ వాలెట్ ద్వారా చెల్లించవచ్చు. మెరూ క్యాబ్స్ సర్వీస్ డెవలప్ చేసిన ఈ అప్లికేషన్ ట్రిప్‌అడ్వైజర్ ద్వారా బెస్ట్ క్యాబ్ యాప్ అవార్డ్ 2014ను కూడా దక్కించుకుంది.

Most Read Articles

English summary
Now Meru Cab service has launched a new mobile app. This app enables customers to book a cab seven days in advance. One can also trace the cab allotted to them, they have also introduced India's first Cab Wallet system.
Story first published: Saturday, October 4, 2014, 10:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X