ఎయిర్‌లెస్ టైర్ల తయారీ కోసం ప్లాంట్ ఏర్పాటు చేసిన మిచెలిన్

By Ravi

గతంలో పోలారిస్ సంస్థ గాలి అవసరం లేని ఎయిర్‌లెస్ టైర్లను అభివృద్ధి చేసినట్లు మనం చదువుకున్నాం. ఇప్పుడు తాజాగా.. ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ మిచెలిన్, ఈ తరహా ఎయిర్‌లెస్ టైర్లను వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు మిచెలిన్ నార్త్ అమెరికాలో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ప్రారంభించింది. ఈ టైరును 'మిచెలిన్ ఎక్స్ ట్వీల్ ఎయిర్‌లెస్ రేడియల్ టైర్' అని పిలుస్తారు. ఇవి నాన్-న్యూమాటిక్ టైర్స్. కమర్షియల్ అప్లికేషన్స్ కోసం ఈ టైర్లను ఉపయోగించనున్నారు. మిచెలిన్ తమ ఎయిర్‌లెస్ టైర్లను తొలిసారిగా 2004 ప్యారిస్ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మిచెలిన్ ఎయిర్‌లెస్ టైర్లు

తర్వాతి స్లైడ్‌లలో మిచెలిన్ ఎయిర్‌లెస్ టైర్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

మిచెలిన్ ఎయిర్‌లెస్ టైర్లు

గాలి అవసరం లేని ఈ టైర్లతో పంక్చర్ సమస్య అస్సలే ఉండదు, ఇవి త్వరగా అరిగిపోవు/చిరిగిపోవు. సాంప్రదాయ టైర్లతో పోల్చుకుంటే, ఈ ఎయిర్‌లెస్ టైర్ల జీవితకాలం కూడా ఎక్కువే.

మిచెలిన్ ఎయిర్‌లెస్ టైర్లు

ఎయిర్‌లెస్ టైర్లు కలిగిన వాహనాలతో ఎలాంటి రోడ్లు, ప్రాంతాల్లోనైనా లేదా అసలు రోడ్లే లేని చోట కూడా ప్రయాణించటం సాధ్యమవుతుంది.

మిచెలిన్ ఎయిర్‌లెస్ టైర్లు

సాధారణ టైర్ల మాదిరిగా నాన్-న్యుమాటిక్ టైర్లకు గాలి అవసరం లేదు. ఈ టైర్లలో ఎయిర్ కంపార్ట్‌మెంట్‌కు బదులుగా ధృడంగా అలాగే ఫ్లెక్సిబల్‌గా ఉండే ప్లాస్టిక్, రబ్బర్‌తో తయారు చేయబడిన స్పోక్స్ వంటి నిర్మాణం ఉంటుంది.

మిచెలిన్ ఎయిర్‌లెస్ టైర్లు

ఈ ఎయిర్‌లెస్ టైర్లు పంక్చర్లు కావు, పగిలిపోవు, అధిక వేగంతో వెళ్తున్నప్పటికీ ఇవి బరస్ట్ కాకుండా ఉండి ప్రమాదాల నుండి రక్షిస్తాయి. ఈ టైర్లు సురక్షితమైనవే కాకుండా ప్రకృతి సాన్నిహిత్యమైనవి కూడా. ఈ టైర్లను 100 శాతం రీసైకిల్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Michelin has opened its newest plant in North America, which will produce the innovative MICHELIN X TWEEL Airless Radial Tire for commercial applications.
Story first published: Tuesday, November 25, 2014, 11:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X