మిత్సుబిషి నుంచి అప్‌గ్రేడెడ్ ల్యాన్సర్ సెడాన్

By Ravi

మిత్సుబిషి ల్యాన్సర్ లేదా ల్యాన్సర్ ఎవల్యూషన్ కారును చూడగానే ముందుగా కొందరికి గుర్తుకు వచ్చేది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలు మరియు పౌల్ వాకర్. ఇంకొందరికీ ర్యాలీ కార్స్, మోడిఫైడ్ రేస్ కార్స్ గుర్తుకు వస్తాయి. పెర్ఫామెన్స్, స్టయిల్‌ల కలయికే మిత్సుబిషి ల్యాన్సర్.

ల్యాన్సర్ ఎవల్యూషన్ ఆల్-వీల్ డ్రైవ్ కలిగిన అత్యంత సరసమైన ధరకే లభించే ర్యాలీ కార్. మిత్సుబిషి తమ కార్లతో కొత్త డ్రైవర్లకు గొప్ప డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. మిత్సుబిషి తాజాగా ల్యాన్సర్ బ్రాండ్‌లో ఓ సరికొత్త మోడల్‌ను తీర్చిదిద్దే పనిలో ఉన్నట్లు సమాచారం. ల్యాన్సర్ ఇవో ఎక్స్ఐ పేరిట ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ల్యాన్సర్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా కొత్త ల్యాన్సర్ ఎక్స్ఐ వెర్షన్‌ను డిజైన్ చేయనున్నారు. సరికొత్త ఫ్రంట్ గ్రిల్ (క్రోమ్ అండ్ శాటిన్ ఫినిష్‌తో), ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్‌తో అనేక కాస్మోటిక్ మార్పులు ఫ్రంట్ డిజైన్‌లో ఉండనున్నాయి.

మిత్సుబిషి ఎక్స్ఆర్-పిహెచ్‌ఈవి కాన్సెప్ట్ కారు నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన విండ్‌స్క్రీన్స్, వెనుక వైపు పెద్ద స్పాయిలర్ (హై స్పీడ్స్ వద్ద మంచి డౌన్‌ఫోర్స్ కోసం), రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్ వంటి మార్పులు ఉండనున్నాయి.

Mitsubishi Lancer Evo X

ఇందులో ఉపయోగించనున్న ఇంజన్, దాని పెర్ఫార్మెన్స్ వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ట్విస్ట్ ఏంటంటే, మిత్సుబిషి ఇందులో ఓ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం మిత్సుబిషి తమ ఎక్స్ఆర్-పిహెచ్‌ఈవి కాన్సెప్ట్ కారులోని టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇది మిత్సుబిషి యొక్క సూపర్ ఆల్-వీల్ కంట్రోల్ సిస్టమ్‌తో లభ్యమయ్యే ఆస్కారం ఉంది.
Most Read Articles

English summary
Rumor has it that the Japanese car manufacturer Mitsubishi is in process of preparing a successor to their Lancer Evo X model. The new model will most likely be called the XI, which is roman numerals for eleven.
Story first published: Wednesday, March 12, 2014, 15:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X