అవుట్‌ల్యాండర్ పిహెచ్ఈవి కాన్సెప్ట్ ఎస్‌ను ఆవిష్కరించనున్న మిత్సుబిషి

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మిత్సుబిషి ప్రపంచ వ్యాప్తంగా విస్తృతశ్రేణి ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఈ కంపెనీ అందిస్తున్న అత్యంత పాపులర్ మోడల్ అవుట్‌ల్యాండర్‌లో మిత్సుబిషి ఓ కాన్సెప్ట్ కారును ఈ ఏడాది జరగనున్న 2014 ప్యారిస్ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచనుంది.

గడచిన 2012 ప్యారిస్ మోటార్ షోలో మిత్సుబిషి తమ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ అవుట్‌‌ల్యాండర్‌ను ప్రదర్శించింది. అప్పట్లో ఈ మోడల్‌కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో, మిత్సుబిషి తమ నెక్స్ట్ జనరేషన్ అవుట్‌‌ల్యాండర్ పిహెచ్ఈవి (ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్) కాన్సెప్ట్ ఎస్‌ను 2014 ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కించనుంది.

Outlander PHEV Concept S

ఈ కాన్సెప్ట్ వాహనాన్ని ఎమ్ఎమ్‌సి డిజైన్ చేసింది, ఇది అవుట్‌ల్యాండర్ పిహెచ్ఈవికి స్పెషల్ వెర్షన్. మునుపటి కాన్సెప్ట్‌తో పోల్చుకుంటే దీని ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్‌ను రీవ్యాంప్ చేయనున్నారు. ప్రస్తుత ప్రొడక్షన్ మోడల్‌తో పోల్చి చూస్తే, ఇది మరింత స్పోర్టీగా, షార్ప్‌గా కనిపిస్తుంది.

మిత్సుబిషి అవుట్‌ల్యాండర్ పిహెచ్ఈవి కాన్సెప్ట్ ఎస్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. ఇందులో 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 200 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇది కేవలం 11 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

Most Read Articles

English summary
Mitsubishi had showcased its Plug-in hybrid electric Outlander at 2012 Paris Motor Show. The vehicle has been well accepted by most markets where it has been launched. At the Mondial de L'Automobile, Mitsubishi has decided to unveil its Outlander PHEV Concept S.
Story first published: Monday, September 8, 2014, 10:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X