7 రెట్లు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉండే అధునాతన బ్యాటరీలు

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు ప్రధానంగా ఆలోచించేది వాటి రేంజ్ గురించే. సాంప్రదాయ బ్యాటరీలు కలిగిన ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ పరిమితంగా ఉంటుంది. ఇలాంటి బ్యాటరీలు కలిగిన ఎలక్ట్రిక్ కార్లలో ఎక్కువ దూరం ప్రయాణించడం సాధ్యం కాదు. అయితే, కొత్తగా అభివృద్ధి చేస్తున్న లిథియం అయాన్ బ్యాటరీలు మాత్రం సాధారణ బ్యాటరీల కన్నా 7 రెట్లు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉండి, బ్యాటరీ కార్లలో నిరంతరాయంగా దూర ప్రయాణం చేసేందుకు వీలుగా ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి: సోలార్ ఆటోరిక్షాలో బెంగుళూరు నుంచి లండన్ వరకు రోడ్ ట్రిప్

లిథియం అయాన్ బ్యాటరీలు మన ఫోన్లలో ఉపయోగించే బ్యాటరీల మాదిరిగా ఎక్కువ సమయం చార్జ్ నిల్వ ఉంచుకొని తద్వారా ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుగా ఉంటాయి. టోక్యో రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలోని ఓ పరిశోధకుల బృందం కొత్త లిథియం అయాన్ బ్యాటరీని ఆవిష్కరించింది. సాంప్రదాయ బ్యాటరీతో పోల్చుకుంటే తాము అభివృద్ధి చేసిన లిథియం అయాన్ బ్యాటరీ 7 రెట్లు అధిక విద్యుత్ స్టోరింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సదరు బృందం పేర్కొంది.

Electric Car

ఈ కొత్త బ్యాటరీలు కిలోకి 2570 వాట్ అవర్‌ల విద్యుత్‌ని నిక్షిప్తం చేసుకోగలవు. ఈ బ్యాటరీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, భవిష్యత్తులో మార్కెట్లోకి రానున్న ఫ్యూయెల్ సెల్ వెహికల్ (ఎఫ్‌సివి) టెక్నాలజీతో పోల్చుకుంటే, ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ కార్లను వైర్లు లేకుండా చార్జింగ్ చేసుకోవచ్చు

పాజిటివ్ ఎలక్ట్రోడ్ యొక్క లిథియం ఆక్సైడ్ క్రిస్టల్ స్ట్రక్చర్‌కు కోబాల్ట్‌ను చేర్చడం ద్వారా అదనపు విద్యత్‌ను పొందటం సాధ్యమవుతుందని, దీని వలన చార్జింగ్ లేదా డిస్‌చార్జింగ్ ప్రక్రియ సమయంలో ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్‌ను సృష్టించడం సాధ్యమవుతుందని పరిశోధకులు వివరించారు. అంతేకాకుండా, ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీ వలన రీచార్జింగ్ సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రయోగ దశలో ఉంది, ఇవి అందుబాటులోకి రావటానికి మరింత సమయం పట్టే ఆస్కారం ఉంది. అంటే, ఇక బ్యాటరీ కార్లు కూడా ఆగకుండా పరుగులు తీస్తాయన్నమాట..

Most Read Articles

English summary
Present day electric cars have one major problem - limited range. Even popular EVs like the Nissan LEAF can travel only around 120 kilometres on a full charge. But a revolution in lithium ion battery technology may be around the corner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X