మే నెలలో 2014 టొయోటా కరోలా ఆల్టిస్ విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ టొయోటా గడచిన సంవత్సరం ద్వితీయార్థంలో అమెరికన్, యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేసిన సరికొత్త నెక్స్ట్ జనరేషన్ కరోలా ప్రీమియం సెడాన్‌ను 'కరోలా ఆల్టిస్' పేరుతో గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ భారత్‌లో ఆవిష్కరించింది. ఈ సరికొత్త అప్‌గ్రేడెడ్ 2014 టొయోటా కరోలా ఆల్టిస్ సెడాన్‌ను మే నెలలో కంపెనీ వాణిజ్య పరంగా విడుదల చేయనుంది.

ఆకర్షనీమైన క్రోమ్ గ్రిల్, బంపర్‌లో చిన్న ఎయిర్ ఇన్‌టేక్, ఫ్రంట్ ఆప్రాన్స్ వరకు స్ట్రెచ్ చేసిన పెద్ద హెడ్‌లైట్స్, రివైజ్డ్ గ్రిల్, కొత్త బానెట్ డిజైన్, బాడీ లైన్స్, పెద్ద ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, రియర్ వ్యూ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్స్, కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక వైపు సన్నటి మరియు పొడవాటి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, రెండు టెయిల్ ల్యాంప్స్ మధ్యలో క్రోమ్ స్ట్రిప్, రీడిజైన్డ్ రియర్ బంపర్‌‌ వంటి అనేక మార్పులు చేర్పులను ఈ కొత్త 2014 టొయోటా కరోలా ఆల్టిస్‌లో చూడొచ్చు.


బ్లాక్ కలర్ ఇంటీరియర్స్, రౌండ్ డయల్స్‌తో కూడిన స్పోర్టీయర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కొత్త సీట్ అప్‌హోలెస్టరీ వంటి ఇంటీరియర్ మార్పులు ఓ లగ్జరీ కారును నడుపుతున్న అనుభూతిని కల్పిస్తాయి.

ఇంకా ఇందులో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెథర్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ప్యాడల్ షిఫ్టర్స్ (ఆటోమేటిక్ వేరియంట్) పుష్ బటన్ స్టార్ట్ వంట్ అనేక ఫీచర్లున్నాయి.

2014 Toyota Corolla Altis India Launch In May

కొత్త టొయోటా కరోలా ఆల్టిస్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఇదివరకటి పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే ఉపయోగించారు. పెట్రోల్ వెర్షన్‌లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ వెర్షన్‌లో 7-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు.

డీజిల్ వెర్షన్‌లో 1.4 లీటర్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేదు.

మే 27, 2014వ తేదీన కొత్త టొయోటా కరోలా ఆల్టిస్ భారత్‌లో విడుదల కానుంది. దీని డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి. కాగా.. ఇప్పటికే టొయోటా డీలర్లు రూ.50,000 బయానా మొత్తంతో ఈ కారు కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు.

Most Read Articles

English summary
At the Auto Expo 2014 Toyota made it clear that it was ready to loosen some restraint with the 2014 Corolla Altis. Unlike the current Corolla Altis sold in India, the 2014 version clearly looked aggressive, if not particularly sporty.
Story first published: Friday, March 14, 2014, 14:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X