కొత్త రవాణా బిల్: పార్కింగ్ ప్రూఫ్ చూపిస్తేనే వాహన రిజిస్ట్రేషన్

భారత ప్రభుత్వం త్వరలోనే మోటార్ వాహనాల చట్టాలను సవరించేందుకు ఓ కొత్త బిల్లును ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసినదే. ఈ బిల్లులో పేర్కొన్న అంశాలను యధావిధిగా అమలుచేస్తే, రోడ్డు/రవాణా/వాహన నిబంధనల్లో అనేక మార్పులు చేర్పులు వచ్చే ఆస్కారం ఉంది. ఈ బిల్లులో తాజా ప్రతిపాదన ఏంటంటే, వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకునే వారు తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని కలిగి ఉండాలి.

ఇదే గనుక అమల్లోకి వస్తే, కారును కొనాలనుకునే వారు ముందుగా పార్కింగ్ స్థలాన్ని బుక్ చేసుకున్న తర్వాతనే కారును బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అనేక మెట్రో నగరాల్లోని ప్రజలను వాహనాలను కొనుగోలు చేసి, పార్కింగ్ స్థలం లేక వాహనాలను రోడ్లపైనే పార్క్ చేస్తుండటం, ఫలితంగా ట్రాఫిక్‌కు అంతరాయం వాటిళ్లుతుండటం వంటి పలు సమస్యల కారణంగా ఈ ప్రతిపాదన చేశారు.

ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు, త్వరపడండి!

కొత్త రోడ్డు రవాణా మరియు భద్రతా బిల్లు 2014లో ఈ ప్రతిపాదన చేశారు. ఈ బిల్లు గురించి పార్లమెంటులో చర్చించి, ఆమోదం తెలిపినట్లయితే, కారు కొనాలనుకునే వ్యక్తికి తప్పనిసరిగా పార్కింగ్ ప్లేస్ ఉండాల్సి వస్తుంది. పార్కింగ్ స్థలానికి సంబంధించిన సాక్ష్యం చూపించకపోయినట్లయితే, సదరు వ్యక్తి వాహనాన్ని రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్టర్ చేయరు.

Show The Parking Proof For Registration
Most Read Articles

English summary
According to the provisions of the new Road Transport & Safety Bill 2014, which is due for a parliamentary debate and approval, it will be mandatory to have a parking lot before a person buys a car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X