నెక్స్ట్ జనరేషన్ హోండా బ్రయోలో సరికొత్త డీజిల్ ఇంజన్

By Ravi

భారత మార్కెట్లో డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. జర్మన్ కార్ కంపెనీ హోండా, ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించినప్పటికీ అమేజ్, సిటీ, మొబిలియో డీజిల్ మోడళ్లతో మార్కెట్లో మంచి జోరు మీదున్న సంగతి తెలిసినదే. ఈ జోరును ఇలానే కొనసాగించేందుకు, హోండా ఇప్పుడు తమ డీజిల్ కార్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని మరింత విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగానే హోండా, ఓ 1.2 లీటర్, 3-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను తయారు చేస్తోంది. హోండా అభివృద్ధి చేయనున్న నెక్స్ట్-జనరేషన్ బ్రయో హ్యాచ్‌బ్యాక్ కోసం కంపెనీ ఈ కొత్త డీజిల్ ఇంజన్‌‌ను డెవలప్ చేస్తోంది. మరో రెండేళ్ల వ్యవధిలో ఈ కారు మార్కెట్లోకి రావచ్చని అంచనా.

హోండా ప్రస్తుతం ఒకే ఒక్క డీజిల్ ఇంజన్ (1.5 లీటర్ ఐ-డిటెక్)ను మాత్రమే ఆఫర్ చేస్తోంది. కంపెనీ అందిస్తున్న మూడు (అమేజ్, సిటీ, మొబిలియో) మోడళ్లలో ఇదే ఇంజన్‌ను హోండా ఉపయోగిస్తోంది. ఒకే ఇంజన్ అయినప్పటికీ, ఇది మంచి విజయాన్ని సాధించింది.

Honda Brio To Get New Diesel Engine

హోండా బ్రయోలో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేని కారణంగా ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. ప్రస్తుతానికి ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. ఈ నేపథ్యంలో, బ్రయోలో 1.2 లీటర్, 3-సిలిండర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ను చేర్చడం వలన ఈ మోడల్ అమ్మకాలను గణనీయంగా పెంచుకోవచ్చనేది హోండా అభిప్రాయం.

వాస్తవానికి హోండా అభివృద్ధి చేయనున్న ఈ కొత్త 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్, ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న 1.5 లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌కు డౌన్‌సైజ్డ్ వెర్షనే. బ్రయో ఫెయిల్యూర్‌కి కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేకపోవటమే కారణం కాదు, దీని డిజైన్ కూడా ఆకట్టుకునేలా లేకపోవటమే. ఈ నేపథ్యంలో, హోండా డెవలప్ చేస్తున్న నెక్స్ట్-జనరేషన్ బ్రయో హ్యాచ్‌బ్యాక్ సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కస్టమర్లను మెప్పించగలదని ఆశిద్దాం.

Most Read Articles

English summary
Japanese carmaker Honda is currently developing a 1.2-litre three-cylinder diesel engine, which is set to debut in the next-gen Brio.
Story first published: Friday, October 17, 2014, 16:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X