షెవర్లే సిటీ ఎక్స్‌ప్రెస్‌గా మారిన నిస్సాన్ ఇవాలియా

By Ravi

నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి భారత మార్కెట్లో అంత పాపులర్ కాకపోయినప్పటికీ, ప్రపంచ మార్కెట్లలో మాత్రం ఈ మోడల్‌కు మంచి క్రేజ్ ఉంది. గ్లోబల్ మార్కెట్లలో ఇది నిస్సాన్ ఎన్‌వి200 పేరుతో అమ్ముడుపోతోంది. నిస్సాన్ ఇదే ప్లాట్‌ఫామ్‌ను పలు ఇతర కంపెనీలకు కూడా ఆఫర్ చేస్తోంది. ఉదాహరణకు మనదేశంలో అశోక్ లేలాండ్ స్టైల్ ఎమ్‌పివి ఇదే ప్లాట్‌ఫామ్‌పై తయారైనదే.

అలాగే జపాన్ మార్కెచ్లో మిత్సుబిషి డెలికా కూడా నిస్సాన్ ఎన్‌వి200 (ఇవాలియా) ప్లాట్‌ఫామ్‌పై తయారైనదే. తాజాగా.. ఇది అమెరికా మార్కెట్లో షెవర్లే సిటీ ఎక్స్‌ప్రెస్‌గా అడుగుపెట్టబోతోంది. ఎక్స్‌ప్రెస్ వ్యాన్ విభాగం క్రింద నిస్సాన్ ఎన్‌వి200 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన సిటీ ఎక్స్‌ప్రెస్‌ను షెవర్లే విడుదల చేయనుంది.


అయితే, షెవర్లే సిటీ ఎక్స్‌ప్రెస్‌లో.. నిస్సాన్ ఎన్‌వి200లో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌కు బదులుగా 2.0లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 132 పిఎస్‌‌ల శక్తిని, 139 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

అమెరికా మార్కెట్లో విడుదల కానున్న షెవర్లే సిటీ ఎక్స్‌ప్రెస్ (అలియాస్ నిస్సాన్ ఇవాలియా, నిస్సాన్ ఎన్‌వి200)లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది. అమెరికా మార్కెట్లో ఇది ఫోర్డ్ ట్రాన్సిట్ కనెక్ట్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. అమెరికాలో దీని ప్రారంభ ధర 22,950 డాలర్లుగా ఉంది.


Chevrolet City Express Doors
Most Read Articles

English summary
Chevrolet has announced that its new Express van the City Express is on its way to dealerships in USA. The Chevrolet City Express, which is based on the Nissan NV200, will be sold under parent company General Motors’ “Business Choice” program, which offers qualified business owners a $350 cash allowance for upfitting, the automaker said.
Story first published: Tuesday, October 28, 2014, 10:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X