హోవర్‌-నిస్సాన్‌ల మధ్య ఒప్పందం రద్దు

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా మరియు భారతీయ మార్కెటింగ్ సంస్థ హోవర్ ఆటోమోటివ్ ఇండియా (హెచ్ఏఐ)ల మధ్య ఒప్పందం హఠాత్తుగా వీగిపోయింది. హెచ్ఏఐతో తమకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది.

భారత మార్కెట్లో నిస్సాన్ కార్ల అమ్మకాలు, మార్కెటింగ్, పంపిణీలకు సంబంధించి గతంలో హోవర్ ఆటోమోటివ్ ఇండియాతో నిస్సాన్ ఇండియా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, ఇకపై భారత్‌లో తమ కార్యకలాపాలాన్ని తామే స్వయంగా నిర్హించుకునే శక్తి సామర్థ్యాలు ఏర్పడ్డాయని, ప్రస్తుతం ఈ విషయంలో తమకు హెచ్ఏఐ నుంచి ఏలాంటి సహకారం అవసరం లేదని, అందుకే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని నిస్సాన్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.

Nissan India Cuts Ties With Hover Automotive

ఈ ఒప్పందం రద్దు చేసుకోవటానికి నిస్సాన్ ఇండియా ఎలాంటి స్పష్టమైన కారణాలను వెల్లడించలేదు. అయితే, ఇలా హఠాత్తుగా ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం పట్ల నిస్సాన్ ఇండియాపై హోవర్ ఆటోమోటివ్ ఇండియా గుర్రుగా ఉంది. ఈ ఒప్పందం రద్దు వెంటనే అమల్లోకి వస్తుందని నిస్సాన్ చెబుతుంటే, హోవర్ మాత్రం ఇది చట్ట పరంగా సాధ్యం కాదని వాదిస్తోంది.

భారత కార్ మార్కెట్లో తమ డాట్సన్ కార్లను తామే స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటామని నిస్సాన్ ప్రకటించినప్పటికీ, ఈ ఇరు సంస్థల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు సమాచారం. అందుకే, నిస్సాన్ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, నిస్సాన్ తీసుకున్న చర్యపై అసంతృప్తితో ఉన్న హోవర్ మాత్రం తమ సంస్థ ఉద్యోగుల, భాగస్వాముల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చర్యలు తీసుకుంటామని చెబుతోంది.

Most Read Articles

English summary
Nissan Motor India Private Ltd (NMIPL), the fully owned Indian subsidiary of Nissan Motor Company today announced that it will take full responsibility of its entire operations in the country with immediate effect.
Story first published: Saturday, February 15, 2014, 17:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X