వెహికల్ ఫైనాన్స్ ఆప్షన్స్ కోసం ఎస్‌బిఐతో చేతులు కలిపిన నిస్సాన్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు గాను, భారతదేశపు అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)తో చేతులు కలిపింది.

ఈ డీల్‌లో భాగంగా, నిస్సాన్ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు, ఎస్‌బిఐ వాహన రుణాలను అందించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 15,000 లకు పైగా ఎస్‌బిఐ బ్రాంచ్‌ల ద్వారా కస్టమర్లు, తక్కువ వడ్డీ రేటుకే వాహన రుణాలను పొందే అవకాశం ఉంటుంది.

nissan tie up with sbi

భారతీయ వినియోగదారులకు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే భారతదేశంలో విస్తృతమైన రీటైల్ ఫైనాన్స్ నెట్‌వర్క్ కలిగిన ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)తో చేతులు కలిపామని, ఈ భాగస్వామ్యం ద్వారా కస్టమర్లు సరసమైన వడ్డీ రేటుకే రుణాలను పొందవచ్చని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరున్ మల్‌హోత్రా చెప్పారు.

ఈ సందర్భంగా.. ఎస్‌బిఐ అధికారిని అనురాధా రావ్ మాట్లాడుతూ.. భారతదేశంలో నిస్సాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవటం సంతోషంగా ఉందని, మా ఈ ఒప్పందంలో భాగంగా, నిస్సాన్ కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న మా 15,000 లకు పైగా బ్రాంచ్‌ల ద్వారా అత్యంత ఆకర్షనీయమై కార్ లోన్ స్కీమ్‌లను పొంది, నిస్సాన్ వాహనాలను కొనుగోలు చేయవచ్చని చెప్పారు.

ఎస్‌బిఐ 7 ఏళ్ల వరకూ రీపేమెంట్ సౌకర్యంతో కూడిన రుణాలను అందిస్తోంది. ఈ రుణాలను టెర్మ్ లోన్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్‌గా ఆఫర్ చేస్తున్నారు. స్త్రీలకు 10.40 శాతం, పురుషులకు 10.45 శాతం వడ్డీ రేటుతో రుణాలను ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రాసెసింగ్ చార్జీలను పూర్తిగా మినహాయిస్తున్నారు.

Most Read Articles

English summary
Nissan today, announced its strategic partnership with the State Bank of India (SBI) to offer its customers easy vehicle finance options across 15,000 plus branches in India.
Story first published: Saturday, November 29, 2014, 9:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X