నిస్సాన్ టెర్రానో ఏడబ్ల్యూడి (4x4) ఇండియాకు వస్తుందా?

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా, గడచిన సంవత్సరం (2013) అక్టోబర్ నెలలో విడుదల తమ టెర్రానో మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇందులో తాజాగా మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త వేరియంట్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

నిస్సాన్ ఫ్రెంచ్ పార్టనర్ రెనో ఇప్పటికే, తమ పాపులర్ డస్టర్ ఎస్‌యూవీలో ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను విడుదల చేసిన నేపథ్యంలో, నిస్సాన్ కూడా ఇదే ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను తమ టెర్రానో ఎస్‌యూవీలో ఉపయోగించే అవకాశం ఉంది (నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ రెనో డస్టర్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన విషయం తెలిసినదే).


రెనో డస్టర్ ఏడబ్ల్యూడి వేరియంట్‌లో ఉపయోగించిన ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మూడు డ్రైవింగ్ మోడ్స్‌ని కలిగి ఉంటుంది. అవి: టూ-వీల్ డ్రైవ్, ఆటో మరియు ఫోర్-వీల్ డ్రైవ్. డ్రైవర్ ఇష్టానికి అనుగుణంగా ఈ డ్రైవింగ్ మోడ్స్‌ను ఎంచుకోవచ్చు. నిస్సాన్ టెర్రానో ఏడబ్ల్యూడి వేరియంట్‌లో కూడా ఇదే తరహాలో డ్రైవింగ్ మోడ్స్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. దీనిని ఐ-డ్రైవ్ టెక్ సిస్టమ్ అని పిలుస్తారు.

నిస్సాన్ టెర్రానో ఏడబ్ల్యూడి ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే.. ఇది కూడా రెనో డస్టర్ ఏడబ్ల్యూడి మాదిరిగానే, టాప్-ఎండ్ వేరియంట్‌‌లో 1.5 లీటర్, కె9కె డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 248 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

Renault Duster AWD

నిస్సాన్ ఇండియా తమ టెర్రాన్ ఏడబ్ల్యూడి వేరియంట్‌లో ఏఎస్ఆర్, ఏఎస్‌పి, ఎలక్ట్రానిక్ టార్క్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లను ఆఫర్ చేయవచ్చని అంచనా. ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన కార్లలో ఈ ఫీచర్లు ఉండటం తప్పనిసరి. నిస్సాన్ ఈ కొత్త వేరియంట్ టెర్రానోలో మరిన్ని కొత్త ఫీచర్లను ఆఫర్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో లభిస్తున్న ఏకైక ఆల్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీ రెనో డస్టర్ మాత్రమే. ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు, ఇది కేవలం టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది. అయితే, ఫోర్డ్ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న ఈకోస్పోర్ట్‌లో మాత్రం ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు ఫోర్డ్ ఈ వేరియంట్‌ను ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Renault India has recently launched its Duster AWD variant. So it might occur that Nissan too offers an AWD system in their Terrano compact SUV, with drive modes that can be switched on the go.
Story first published: Wednesday, October 29, 2014, 15:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X