ఫ్యూచర్ కార్లలో స్టీరింగ్ వీల్స్ ఉండవు!

By Ravi

ఆటోమొబైల్ టెక్నాలజీలో రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తోంది. ఒకప్పటి ఆటోమొబైల్ ప్రపంచానికి ప్రస్తుత ఆటోమొబైల్ ప్రపంచానికి మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తే, ఈ రంగం ఎంత అభివృద్ధి చెందిందో కనిపిస్తుంది. ఈ అభివృద్ధి ఇంతటితో ఆగిపోకుండా భవిష్యత్తులో మరిన్ని కొత్త పుంతలు తొక్కనుంది. ఫ్యూచర్ కార్స్ ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకోనున్నాయి.

ఇది కూడా చూడండి: డ్రైవర్లు లేని కాన్వాయ్!

భావి తరాల కోసం ఇప్పటి నుంచే మన పరిశోధకులు అనేక కొత్త సాంకేతికలను అభివృద్ధి చేస్తున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, భవిష్యత్ కార్లలో స్టీరింగ్ వీల్, బ్రేక్ పెడల్, రియర్ వ్యూ మిర్రర్ ఇంకా హారన్స్ వంటి కొన్ని కీలక ఫీచర్లు కనుమరుగు కానున్నట్లు తేలింది. భవిష్యత్ అంటే 2035 నాటికి.

No Steering Wheels On Future Cars

దాదాపు 200 మంది పరిశోధకులు, విశ్వవిద్యాల విద్యార్థులు, ఆటోమోటివ్ వాహనాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. డ్రైవర్‌లెస్ కార్లను తయారు చేయకుండా ఉండటానికి గల ఆరు వైఫల్యాలను చెప్పమని వారిని కోరగా, లీగల్ లయబిలిటీ, పాలసీ మేకర్స్, కన్జ్యూమర్ యాక్సెప్టెన్సీలకు టాప్-మోస్ట్ ర్యాంకింగ్ వచ్చింది.

ప్రస్తుతం ఉన్న వాహనాల్లో ఏయే అంశాలను తొలగించాలోనని కోరగా, రియర్ వ్యూ మిర్రర్స్, ఎమర్జెన్సీ బ్రేక్, హారన్స్‌లను తొలగించాల్సిందిగా ఈ సర్వేలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. 2030-2035 నాటికి కార్లలో ఈ మూడు ఫీచర్లతో పాటుగా స్టీరింగ్ వీల్స్, పెడల్స్ కూడా మిస్ కానున్నాయి. అంటే, భవిష్యత్తులో చాలా వరకు కార్లు ఆటోమేటిక్‌గా నడవనున్నాయన్నమాట.

అయ్యో రామా.. డ్రైవర్ లేకుండా కారెలా వెళ్తుంది..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/uxRUBPDN-tU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
The Institute of Electrical and Electronic Engineers (IEEE), has recently conducted a survey revealing that the cars of the future will lose a few critical elements like the steering wheel, brake pedal, rear view mirrors and even horns on mass produced vehicles. Future meaning by 2035.&#13;
Story first published: Wednesday, July 16, 2014, 15:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X