క్వాడ్రిసైకిల్‌ను విడుదల చేయనున్న మహీంద్రా అండ్ మహీంద్రా

By Ravi

భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, ఇప్పుడు క్వాడ్రిసైకిల్ వాహన విభాగంపై కన్నేసింది. భారత ప్రభుత్వం గడచిన సంవత్సరం డిసెంబర్ నెలలో క్వాడ్రిసైకిల్ (Quadricycle) అనే కొత్త వాణిజ్య వాహన విభాగాన్ని గుర్తిస్తూ ఆమోదం తెలుపటం, ఇటీవలే ఈ తరహా వాహనాలు దేశ రాజధాని రోడ్లపై ప్రయోగాత్మకం విడుదల చేయటం జరిగిన నేపథ్యంలో, పలు దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు తాము కూడా ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

ఇందులో భాగంగానే మహీంద్రా అండ్ మహీంద్రా సుమారు రూ.100-150 కోట్ల పెట్టుబడితో క్వాడ్రిసైకిల్ తయారీని చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు పూర్తవటానికి మరో రెండేళ్ల సమయం పట్టవచ్చని అంచనా. మహీంద్రా క్వాడ్రిసైకిల్స్ ఈ సెగ్మెంట్లోని బజాజ్ ఆర్ఈ60 వంటి మోడళ్లతో పోటీపడే ఆస్కారం ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం మహీంద్రా క్వాడ్రిసైకిల్ ప్రాజెక్టును సి101 పేరుతో ప్రారంభించినట్లు మరియు దీనిని సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనిని మహీంద్రా జహీరాబాద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.


క్వాడ్రిసైకిల్స్ విషయానికి వస్తే.. రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గడచిన డిసెంబర్ నెలలో క్వాడ్రిసైకిల్ అనే కొత్త వాహన విభాగానికి గ్రీన్ సిగ్నల్ తెలిపింది. అయితే, క్వాడ్రిసైకిల్ వాహనాలను కేవలం నగర పరిధిలో (సిటీ లిమిట్స్)నే వినియోగించేందుకు అనుమతినిచ్చారు. అంతేకాకుండా, వీటిని ప్రజా రవాణా మరియు వాణిజ్య రవాణా (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మరియు కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్) వాహనాలుగా మాత్రమే ఉపయోగించాలనే నిబంధన విధించారు.

'క్వాడ్రిసైకిల్'ను కొత్త వాహన విభాగం గుర్తించిన సర్కార్ వీటిని రెగ్యులర్ కార్ల మాదిరిగా వ్యక్తిగత రవాణా (పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్) కోసం ఉపయోగించడానికి మాత్రం అనుమతివ్వలేదు. అన్ని ఇతర వాహనాల మాదిరిగానే వీటిలో ఎలక్ట్రిక్ వెర్షన్లను తయారు చేసేందుకు కూడా తయారీదారులకు అనుతినిచ్చారు. ప్రస్తుతం నగర రోడ్లపై తిరుగుతున్న సాంప్రదాయ త్రిచక్ర వాహనాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా ఈ కాడ్రిసైకిల్‌ను పరిగణించడం జరుగుతుంది.

Quadricycle

కాడ్రిసైకిల్స్ విషయంలో క్రాష్ టెస్ట్ సౌకర్యం లేదు కాబట్టి, ఇవి తప్పనిసరిగా డ్యూయెల్ కార్-టైప్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉండాలి. అంతేకాకుండా, వీటిలో 450 కిలోలకు మంచి ఎక్కువ బరువు కలిగి ఉండేలా ప్రయాణికులను తరలించకూడదు. ఇవి 3 మీటర్ల కంటే ఎక్కువ పొడవును కలిగి ఉండకూడదు. కమర్షియల్ వేరియంట్స్ విషయంలో పేలోడ్ 550 కేజీలు ఉండాలి, వీటి పొడవు 3.7 మీటర్ల వరకు ఉండొచ్చు. ప్యాసింజర్ వెర్షన్ క్వాడ్రిసైకిళ్లలో నలుగురు వ్యక్తులకు మించి ప్రయాణించకూడదు (డ్రైవర్‌తో కలిపి).
Most Read Articles

English summary
Country's largest utility vehicles maker Mahindra and Mahindra is planning to bring a quadricycle, a new category of commercial vehicle. The Company will entail an investment of Rs.100-150 crore and take at least 24 months to develop this all-new quadricycle.
Story first published: Thursday, October 23, 2014, 10:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X