నవంబర్ 15 తర్వాత తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

By Ravi

వాహన చాలకులకు మరో తీపి కబురు. ఈనెల ఆరంభంలో లీటరుకు రూ.2 లకు పైగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈనెలలోనే మరోసారి తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధర తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, నవంబర్ 15వ తేదీన నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరను తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా ట్రెండ్ ప్రకారం చూస్తే.. నవంబర్ 15వ తేదీ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 1 రూపాయికి పైగా తగ్గే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే, గడచిన ఆగస్ట్ 2014 నెల నుంచి పెట్రోల్ ధరలు వరుసగా 7వ సారి తగ్గినట్లు కాగా, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత దీని ధరలు వరుసగా 3వ సారి తగ్గినట్లు అవుతుంది.

Petrol Pump

గడచిన ఆగస్ట్ 2014 నుంచి చూసుకుంటే పెట్రోల్ ధర ఇప్పటి వరకు లీటరుకు రూ.9.36 వరకు తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.64.25 గాను, లీటరు డీజిల్ ధర రూ.53.35 గాను ఉంది. దాదాపు ఐదేళ్ల తర్వాత మొట్టమొదటి సారిగా అక్టోబర్ 19, 2014వ తేదీన డీజిల్ ధరను లీటరుకు రూ.3.37 చొప్పున తగ్గించిన సంగతి తెలిసినదే.

చివరిగా డీజిల్ ధరను జనవరి 2009వ సంవత్సరంలో, ఆ తర్వాత వరుసగా దీని ధరను పెంచుకుంటూ వచ్చి, ప్రభుత్వంపై పడుతున్న సబ్సిడీ భారాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చి, పూర్తిగా శూన్యం చేశారు. అనంతరం డీజిల్ ధరలకు స్వేచ్ఛ కల్పించారు. ప్రస్తుతం పెట్రోల్ ధరల మాదిరిగానే డీజిల్ ధరలను కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలే నిర్ణయిస్తాయి.

Most Read Articles

English summary
Petrol and Diesel prices likely to be slashed again as crude oil price fell to its lowest in four years at $80.85 a barrel. Petrol and diesel prices are likely to be cut by close to Rs. 1 per litre this weekend.
Story first published: Wednesday, November 12, 2014, 17:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X