లీటరుకు రూ.2.50 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

By Ravi

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి లీటరుకు రూ.2.50 చొప్పున తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు మరింత తగ్గిన నేపథ్యంలో, శుక్రవారం నాడు చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో ఈ ధరల తగ్గింపును వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ ముడిచమురు ధర దాదాపు 85 డాలర్లకు పడిపోయింది. ఈ శుక్రవారం తీసుకునే నిర్ణయంలో పెట్రోల్ ధరను తగ్గించినట్లయితే, గడచిన ఆగస్ట్ 2014వ తేది నుంచి ఇది వరుసగా 6వ తగ్గింపు కానుంది. అలాగే, డీజిల్ ఇంధనంపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేసిన తర్వాత ఇది తొలి తగ్గింపు అవుతుంది.

Petrol Diesel Price

గడచిన అక్టోబర్ 2014 నెలలో రెండు సందర్భాలలో పెట్రోల్ ధరను దాదాపు రూ.2 వరకూ తగ్గించిన సంగతి తెలిసినదే. ఇదే నెలలో డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేయటంతో డీజిల్ ధరలో లీటరుకు రూ.3.37 వరకూ తగ్గింది. జనవరి 29, 2009లో డీజిల్ ధరను లీటరుపై రూ.2 చొప్పున తగ్గించన తర్వాత, సుమారు ఐదేళ్ల అనంతరం డీజిల్ ధరను తగ్గించడం ఇదే మొదటిసారి.

జనవరి 29, 2009 నాటికి లీటరుకు 30.86గా ఉన్న డీజిల్ ధర ఏకంగా లీటరుకు రూ.58.97 లకు పెరిగింది. డీజిల్ డీరెగ్యులేషన్ తర్వాత విధించిన తగ్గింపు కారణంగా ప్రస్తుతం ఢిల్లీలో లీటరు డీజిల్ ధర లీటరుకు రూ.55.6లుగా ఉంది. అలాగే, ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.66.65లుగా ఉంది.

Most Read Articles

English summary
Petrol and Diesel prices are set come down again by upto Rs 2.50 per litre from Friday midnight due to fall in international brent crude oil prices.
Story first published: Thursday, October 30, 2014, 16:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X