మరోసారి స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

By Ravi

గడచిన డిసెంబర్ నెలలో పెట్రోల్, ఢీజిల్ ధరలను పెంచిన చమురు కంపెనీలు, వీటి ధరలను మరోసారి పెంచాయి. రూపాయి విలువ పడిపోవటం కారణంగా, ప్రపంచ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం తద్వారా ఉత్పత్తి వ్యయం పెరగటంతో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ దరలను స్వల్పంగా పెంచాయి.

లీటరు పెట్రోల్‌పై 75 పైసలు, డీజిల్‌పై 50 పైసలు చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. సవరణ అనంతరం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
పెట్రోల్ ధరలు:
* ఢిల్లీ - రూ.72.43
* కోల్‌కటా - రూ.79.55
* ముంబై - రూ.79.52
* చెన్నై - రూ.75.68

డీజిల్ ధరలు:
* ఢిల్లీ - రూ.54.34
* కోల్‌కటా - రూ.58.76
* ముంబై - రూ.61.42
* చెన్నై - రూ.57.93

Petrol Price

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రతినెలా 50 పైసల చొప్పున పెరుగుతున్న డీజిల్ ధరలకు మరో రెండు నెలల్లోనే పూర్తిగా స్వేచ్ఛ (డీరెగ్యులేట్) కల్పిస్తామనికల్పిస్తామని గడచిన డిసెంబర్ నెలలో కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. డీజిల్ విక్రయాలపై ఆదాయ నష్టం లీటరుకు రూ.8-9 మేర ఉంటోంది. ఇదే గనుక జరిగితే మరో రెండు మూడు నెలల్లో డీజిల్ ధర ఒక్క సారిగా రూ.10 వరకు పెరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

సబ్సిడి ధరకే డీజిల్‌ను విక్రయించడం వలం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం (బిపిసిపిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ (హెచ్‌పిసిఎల్) వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ప్రథమార్థంలో రూ.60,907 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, ఇంధన ధరలు పెంచితే, ఇక కాంగ్రెస్ సర్కారు సంగతి అంతే సంగతులు అంటున్నారు రాజకీయ వేత్తలు.

Most Read Articles

English summary
Petrol price was on Friday hiked by 75 paise and diesel by 50 paise a litre as rise in global oil rates and fall in rupee value increased the cost of production. The hikes, effective Friday midnight, are excluding local sales tax or VAT and actual increase will be higher and vary from city to city.
Story first published: Friday, January 3, 2014, 20:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X