ఏటివిలను రెగ్యులర్ రోడ్లపై వాడేలా మార్చనున్న పోలారిస్

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ ఆల్-టెర్రైన్ వాహనాల (ఏటివి) తయారీ కంపెనీ పోలారిస్ ఇండియా, దేశీయ విపణిలో కాంపిటీషన్ లేని కారణంగా ఏటివిల విభాగంలో ఏకైక కంపెనీగా రాణిస్తున్న సంగతి తెలిసినదే. పోలారిస్ ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక రకాల ఆల్-టెర్రైన్ వాహనాలను విక్రయిస్తోంది. అయితే, ఇవన్నీ ఆఫ్-రోడింగ్ ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ఆల్-టెర్రైన్ వాహనాలను సాధారణ రోడ్లపై సైతం నడిపేందుకు వీలుగా మార్పులు చేయాలని పోలారిస్ యోచిస్తోంది. రానున్న 3 నుంచి 5 ఏళ్లలో పోలారిస్ సరికొత్త మోడళ్లను భారత్‌కు పరిచయం చేయనుంది. ఇందులో ప్రస్తుత ఏవి రేంజ్ మోడళ్లను ఆధారంగా చేసుకొని కొత్త మోడళ్లు రానున్నాయి. అయితే, ఇవి సాంప్రదాయ ఏటివిల మాదిరిగా కాకుండా రోడ్ లీగల్‌గా ఉంటాయి.

Polaris Looking To Convert ATVs For Road Use In India

ప్రస్తుతం ఏటివి మోడళ్లను రోడ్ లీగల్ మోడళ్లుగా మార్చేందుకు గాను పోలారిస్ ఇంజన్ కాలుష్య నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రియర్ వ్యూ మిర్రర్స్ జోడించడం, ఇండికేటర్ ల్యాంప్స్ మరియు రోడ్ లీగర్ టైర్లను జోడించడం వంటి మార్పులు చేయాల్సిన అసరం ఉంది. వీటిని రెగ్యులర్ రోడ్లపై చూడాలంటే మరి కొన్నేళ్ల సమయం పట్టే ఆస్కారం ఉంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో పోలారిస్ ఇండియా అందిస్తున్న ఉత్పత్తులు, వాటి తాజా ధరలు (ఏప్రిల్ 2014 నాటికి) క్రింది విధంగా ఉన్నాయి:
* Phoenix 200 Boardwalk Blue Rs. 4,88,946
* Outlaw 50 LE Pink - Rs. 2,63,818
* Outlaw 50 Boardwalk Blue/White - Rs. 2,63,818
* RZR 170 Indy Red - Rs. 5,29,395
* Ranger Crew 800 EFI Sage Green - Rs. 18,00,035
* Ranger Crew 800 Sage Green - Rs. 18,00,035
* Ranger Crew 800 EPS Pursuit Camo - Rs. 18,00,035
* RZR S 800 Indy Red - Rs. 13,38,460
* RZR 900 Indy Red - Rs. 20,81,271
* RZR 4 800 EPS Stealth Black LE - Rs. 22,85,020
* RZR 4 900 EPS Orange Madness LE - Rs. 27,64,781
* RZR XP 1000 EPS Titanium Matte Matallic - Rs. 28,80,079
* RZR XP 1000 EPS White Lightening LE - Rs. 28,80,079
* RZR XP4 900 Indy Red - Rs. 24,09,796
* RZR XP, 900 EFI, I.RED - Rs. 21,13,239

Most Read Articles

English summary
Polaris India has had a successful run in India so far, largely due to lack of competition. There wide range of reliable ATVs have found many takers, from personal users to organizations for recreational use and also by the military and police forces.
Story first published: Saturday, May 24, 2014, 15:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X