త్వరపడండి.. కేవలం కొన్ని పోర్షే 918 స్పైడర్ కార్లు మాత్రమే మిగిలున్నాయ్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ పోర్షే నుంచి అత్యంత పాపులర్ అయిన 918 స్పైడర్ మోడల్ దాదాపుగా అమ్ముడుపోయింది. ఈ మోడల్‌కు ఇక కేవలం కొన్ని యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని పోర్షే ఉత్తర అమెరికా విభాగం వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆండ్రూ ఊస్తుయ్‌జెన్ తెలిపారు.

పోర్షే 918 స్పైడర్ ఒక లిమిటెడ్ ఎడిషన్ హైపర్ కారు. పేరుకు తగినట్లుగా కంపెనీ కేవలం 918 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఈ సంఖ్యలో దాదాపుగా మెజారిటీ యూనిట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం.

పోర్షే 918 స్పైడర్ మాదిరిగానే మెక్‌లారెన్ పి1, ఫెరారీ లాఫెరారీ కార్లు కూడా లిమిటెడ్ ఎడిషన్ హైపర్ కార్లే. అయితే, వీటి ఉత్పత్తిని పోర్షే 918 స్పైడర్ ఉత్పత్తి కన్నా తక్కువ యూనిట్లకే పరిమితం చేశారు. మెక్‌లారెన్ పి1 ఉత్పత్తిని 375 యూనిట్లకు పరిమితం చేయగా, ఫెరారీ లాఫెరారీ ఉత్పత్తిని 499 యూనిట్లకు పరిమితం చేశారూ.

few porsche 918 spyder left

పోర్షే 918 స్పైడర్ కారులో 4.6 లీటర్, వి-8 ఇంజన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి కలిసి గరిష్టంగా 887 బిహెచ్‌పిల శక్తిని, 1275 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

పోర్షే 918 స్పైడర్ నర్‌బర్గ్‌రింగ్‌పై ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కారుగా అధికారిక రికార్డును కలిగి ఉంది. ఇది కేవలం 6:57 ల్యాప్ సమయంలో ఈ రికార్డును సాధించింది. ఇది కేవలం 2.7 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 340 కిలోమీటర్లు.

సెప్టెంబర్ 18, 2013వ తేదీ నుంచి పోర్షే 918 స్పైడర్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఆర్డర్ మేరకు ఈ కారును తయారు చేస్తారు. అమెరికా మార్కెట్లో దీని ధర 8,47,975 డాలర్లు (సుమారు రూ.5.18 కోట్లు). ఈ కారును కొనాలనుకునే కస్టమర్లు ముందుగా 2,00,000 డాలర్లు (సుమారు రూ.1.22 కోట్లు) డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్ కార్లు ఎక్కువగా యూఎస్‌లోనే అమ్ముడుపోయాయి.

Most Read Articles

English summary
According to Andre Oosthuizen, vice president of marketing for Porsche's North American arm, only a few more units of the Porsche 918 Spyder are available. The limited-edition hypercar is almost sold out.
Story first published: Friday, October 24, 2014, 11:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X