చైనా మార్కెట్ కోసం రెనో ఎలక్ట్రిక్ ఫ్లూయెన్స్ సెడాన్

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో భారత మార్కెట్లో ఫ్లూయెన్స్ సెడాన్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. రెనో తమ ఫ్లూయెన్స్‌ను కేవలం భారత మార్కెట్లోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తోంది. అందులో చైనా మార్కెట్ కూడా ఒకటి.

అయితే, చైనా మార్కెట్లో ఫ్లూయెన్స్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లభ్యం కానుంది. మరో కంపెనీ కోసం రెనో చైనాలోనే ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ ఫ్లూయెన్స్‌ను తయారు చేస్తోంది. ఆ కంపెనీ పేరు, ఇతర వివరాలను మాత్రం రెనో వెల్లడించడం లేదు.

renault electric fluence for china market

రెనో ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోకి ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ ఫ్లూయెన్స్ ఓ గొప్ప అడిషన్ కానుంది. ప్రస్తుతం రెనో చైనాలో తమ భాగస్వామి డోంగ్‌ఫెంగ్ మోటార్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఇటీవలే వీరికి చైనాలోనే వాహనాలను అసెంబ్లింగ్ చేసేందుకు అనుమతి కూడా లభించింది.

ఈ అనుమతి వలన చైనాలో మరింత పోటీతత్వం పెరగనుంది. రెనో తమ ఫ్లూయెన్స్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల చేస్తే, అది ఖచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియాలో ఇప్పటికే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న రెనో ఫ్లూయెన్స్ సెడాన్ కేవలం పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తోంది. రెనో ఇండియా దేశీయ విపణిలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈనెలలో రెనో తమ డస్టర్‌లో ఓ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను విడుదల చేయనుంది.

Most Read Articles

English summary
In India Renault offers its Fluence sedan, it is also available in a selected few markets. The French manufacturer offers this sedan in China as well. However, the now plan to offer a vehicle based on the Fluence with an electric option.
Story first published: Saturday, September 20, 2014, 14:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X