రెనో కొలియోస్‌లో ఫేస్‌లిఫ్ట్; సరసమైన ధరకే లభ్యం!

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ కొలియోస్‌లో ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. రెనో ఇండియా సెప్టెంబర్ 2011లో తొలిసారి తమ కొలియోస్ ఎస్‌యూవీ భారత్‌లో విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో టొయోటా ఫార్చ్యూనర్, షవెర్లే కాప్టివా వంటి ప్రీమియం మోడళ్లకు ధీటుగా ప్రవేశపెట్టిన రెనో కొలియోస్ ప్రీమియం ధర (అప్పట్లో దీని ధర రూ.22.99 లక్షలు) కారణంగా ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు.

ప్రస్తుతం ఈ మోడల్ ధర రూ.24 లక్షల నుంచి రూ.25 లక్షల రేంజ్‌లో ఉంది. ఇందులో 2.0 లీటర్ సిఆర్‌డి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ప్రస్తుతం ఇది కేవలం ఫోర్-వీల్ (4x4) డ్రైవ్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. అయితే, ఈ మోడల్ అమ్మకాలను పెంచుకునేందుకు సరమైన ధరకే అప్‌గ్రేడెడ్ రెనో కొలియోస్‌ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

Renault Koleos

ఈ దిశలో భాగంగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోర్-వీల్ డ్రైవ్ వెర్షన్ కొలియోస్‌కు బదులుగా టూ-వీల్ (4x2) డ్రైవ్ ఆప్షన్‌తో కూడిన కొత్త కొలియోస్‌ను విడుదల చేయవచ్చని సమాచారం. అంతేకాకుండా, ఈ మోడల్ ధరను వీలైనంత తక్కువగా ఉంచేందుకు ప్రస్తుతం లభిస్తున్న కొలియోస్‌లోని కొన్ని ఫీచర్లను తొలగించి ఈ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

కానీ, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంజన్‌నే కొద్దిగా రీట్యూన్ చేసి ఫేస్‌‌లిఫ్ట్ వెర్షన్‌లో ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 171 బిహెచ్‌పిల శక్తిని, 36.7 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే, ఇది 23 బిహెచ్‌పిలు, 4.7 కెజిఎమ్‌లు అదనం. గేర్‌బాక్స్‌లో కూడా మార్పు ఉండే అవకాశం లేదు, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్సునే ఇందులోను ఉపయోగించనున్నారు.

Most Read Articles

English summary
French carmaker Renault India is planing to upgrade its premium SUV Koleos. The facelift Renault Koleos will be only offered with two-wheel drive option during the launch.
Story first published: Thursday, January 2, 2014, 11:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X