రెనో ఇండియా నుంచి ఓ కొత్త ఎమ్‌పివి, మరో స్మాల్ కార్

By Ravi

రెనో ఇండియా వచ్చే ఏడాది భారత మార్కెట్లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయటం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తోంది. ఈ రెండు కొత్త ఉత్పత్తులలో ఓ మల్టీ పర్పస్ వెహికల్ (ఎమ్‌పివి) మరో చిన్న కారు (బడ్జెట్ స్మాల్ కార్) ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్‌లో ఇప్పటికే ఓ ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు రెనో ఇండియా సిద్ధంగా ఉంది.

మరికొద్ది రోజుల్లోనే ఈ ఫోర్-వీల్ డ్రైవ్ రెనో డస్టర్ ఇండియాలో విడుదల కానుంది. గడచిన సంవత్సరం (2013)లో రెనో ఇండియా మొత్తం అమ్మకాలలో దాదాపు 75 శాతం వాటా డస్టర్ ఎస్‌యూవీదే. ఈ ఏడాదిలోనే డస్టర్ 4x4ను విడుదల చేసిన తర్వాత, రెనో ఇండియా వచ్చే ఏడాదిలో మరో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఇందులో ఒకటి మాస్ మార్కెట్‌ను ఉద్దేశించి, రూ.4 లక్షలకు దిగువన కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఓ చిన్న కారు.

ఇంకొకటి మల్టీ పర్సస్ వెహికల్ సెగ్మెంట్లో హోండా మొబిలియో, మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా జైలో, షెవర్లే ఎంజాయ్ వంటి మోడళ్లకు పోటీగా విడుదల చేయబోయే ఓ సరికొత్త ఎమ్‌పివి. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో 2.2 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్న రెనో ఇండియా, దేశంలోని కార్ల కంపెనీల జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ప్రస్తుతం 2.2 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను మరో రెండు-మూడేళ్లలో 5 శాతానికి పెంచుకునే దిశగా కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది.

Most Read Articles

English summary
Renault India are looking to increase their market share in the country by launching two new cars next year. One will be a Multi Purpose Vehicle (MPV) and the other a small car.
Story first published: Wednesday, August 27, 2014, 17:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X