మారుతి సుజుకి కార్లకే అగ్రస్థానం: రిపోర్ట్

By Ravi

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఎంట్రీ లెవల్ కార్ మార్కెట్లో అత్యధిక వాటాను కలిగి ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే. దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మారుతి సుజుకి కార్లే ముందుంటాయి. గడచిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మారుతి ఆల్టో కారు నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో ద్వితీయ స్థానంలో స్విఫ్ట్ డిజైర్ సెడాన్, తృతీయ స్థానంలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, నాల్గవ స్థానంలో వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి. అంటే, ఈ త్రైమాసికంలో అమ్ముడైన టాప్ కార్లలో మొదటి నాలుగు మోడళ్లు మారుతి సుజుకికి చెందినవే అన్నమాట.

విశ్వసనీయమైన బ్రాండ్, విస్తృతమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్, కస్టమర్ల బడ్జెట్‌కు అనుగుణంగా అందుబాటులో ఉండే కార్లు ఇలా అనేక అంశాలను మారుతి సుజుకిని భారత్‌లో ఓ సక్సెస్‌ఫుల్ కార్ మేకర్‌గా నిలపగలిగాయి. ఇకపోతే ఇదే సమయంలో హ్యుందాయ్ తాజాగా ప్రవేశపెట్టిన గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉండగా, హోండా సిటీ సెడాన్ ఆరవ స్థానంలో ఉంది.

ఆల్టో

ఆల్టో

ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో మారుతి సుజుకి మొత్తం 64,573 ఆల్టో కార్లను విక్రయించింది. అంతకు ముందు ఇదే సమయంలో కంపెనీ 56,335 ఆల్టో కార్లను విక్రయించినట్లుగా సియామ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

స్విఫ్ట్ డిజైర్

స్విఫ్ట్ డిజైర్

ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో స్విఫ్ట్ డిజైర్ అమ్మకాలు 50,951 యూనిట్లుగా ఉంటే, అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇవి 49,259 యూనిట్లుగా ఉన్నాయి.

స్విఫ్ట్

స్విఫ్ట్

ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు మాత్రం 48,120 యూనిట్ల నుంచి 47,442 యూనిట్లకు పడిపోవటం గమనార్హం. అంటే కస్టమర్లు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కన్నా స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట.

వ్యాగన్ఆర్

వ్యాగన్ఆర్

ఇక వ్యాగన్ఆర్ అమ్మకాలు 2014-15 మొదటి త్రైమాసికంలో 38,156 యూనిట్లుగా నమోదైతే అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 35,141 యూనిట్లుగా ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్

హ్యుందాయ్ గ్రాండ్

ఐదవ స్థానంలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ అమ్మకాలు గడచిన త్రైమాసికంలో 26,830 యూనిట్లుగా నమోదయ్యాయి.

హోండా సిటీ

హోండా సిటీ

ఈ సమయంలో హోండా సిటీ సెడాన్ అమ్మకాలు 6,949 యూనిట్ల నుంచి 21,985 యూనిట్లకు పెరిగాయి.

ఎక్సెంట్

ఎక్సెంట్

ఈ త్రైమాసికంలో హ్యుందాయ్ కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలు 21,524 యూనిట్లుగా రికార్డ్ అయ్యాయి.

ఇయాన్

ఇయాన్

ఇయాన్ అమ్మకాలు 24,526 యూనిట్ల నుంచి 19,379 యూనిట్లకు పడిపోయాయి.

సెలెరియో

సెలెరియో

సెలెరియో అమ్మకాలు 16,541 యూనిట్లుగా నమోదయ్యాయి.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్ అమ్మకాలు 15,853 యూనిట్ల నుంచి 15,182 యూనిట్లకు పడిపోయాయి.

Most Read Articles

English summary
Country's largest carmaker Maruti Suzuki India continues its dominance on the Indian roads with its four models, led by entry level small car Alto heading the top ten best sellers list in April-June quarter this fiscal.
Story first published: Tuesday, July 22, 2014, 16:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X