బిఎమ్‌డబ్ల్యూ బ్యాటరీలో శామ్‌సంగ్ సెల్

By Ravi

ప్రపంచంలోని పాపులర్ మొబైల్ కంపెనీలు ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలవైపు చూస్తున్నాయి. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఆటోమొబైల్స్ కోసం కార్ ప్లే పేరిట కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పరిచయం చేసిన కొద్ది రోజులకే ఆండ్రాయిడ్ ఆటో పేరిట ఆండ్రాయిడ్ సంస్థ (గూగుల్‌కు చెందినది) మరో కొత్త రకం ఇన్-కార్ ఇన్ఫోటైన్‌మెంట్ టెక్నాలజీని పరిచయం చేసింది.

ఇది కూడా చదవండి: గూగుల్ కంపెనీలో చేరిన మాజీ ఫోర్డ్ సీఈఓ, ఎలక్ట్రిక్ కార్ల కోసమా?

ఈ నేపథ్యంలో, ఇప్పుడు మొబైల్ ఫోన్ కంపెనీలు ఆటోమొబైల్ సంస్థలను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే, ప్రపంచ మొబైల్ దిగ్గజం శామ్‌సంగ్ జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూతో చేతులు కలిపింది. అయితే, ఈ ఒప్పందం కాస్తంత భిన్నమైనది. ఇక్కడ శామ్‌సంగ్ ఇన్ఫోటైన్‌మెంట్ టెక్నాలజీకి బదులుగా బ్యాటరీ సెల్స్‌లను బిఎమ్‌డబ్ల్యూకి సరఫరా చేయనుంది.

Samsung To Power BMW Cars

శామ్‌సంగ్ బ్యాటరీ సెల్స్‌లను బిఎమ్‌డబ్ల్యూ ఏంచేసుకుంటుందనుకుంటున్నారా? బిఎమ్‌డబ్ల్యూ రూపొందిస్తున్న ఐ3, ఐ8 ఎలక్ట్రిక్ కార్లతో పాటుగా కంపెనీ భవిష్యత్తులో తయారు చేయబోయే హైబ్రిడ్ మోడళ్లలో అమర్చే బ్యాటరీల తయారీలో ఉపయోగించే సెల్స్‌లను శామ్‌సంగ్ నుంచి గ్రహించనున్నారు. ఇక్కడ శామ్‌సంగ్ కేవలం బ్యాటరీ సెల్స్‌లను మాత్రమే సరఫరా చేస్తుంది, బ్యాటరీలను బిఎమ్‌డబ్ల్యూ స్వంతంగా అసెంబ్లింగ్ చేసుకుంటుంది.

ఇది కూడా చదవండి: భవిష్యత్ కార్లలో స్టీరింగ్, బ్రేక్స్ ఉండవు!

ఇవి లిథియం అయాన్ బ్యాటరీలు (మొబైల్ ఫోన్లలో ఉపయోగించే రకం). ఈ బ్యాటరీలు తక్కువ బరువును కలిగి ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ హై-వోల్టేజ్ బ్యాటరీలను డింగోల్ఫింగ్‌లోని బిఎమ్‌డబ్ల్యూ ప్లాంట్ వద్ద అసెంబ్లింగ్ చేస్తారు.

Most Read Articles

English summary
The BMW Group and Samsung SDI plan to expand their supply relationship for battery cells for electro-mobility. The two companies signed a memorandum of understanding (MoU) to this effect today in Seoul. Samsung SDI will supply the BMW Group with battery cells for the BMW i3, BMW i8 and additional hybrid models over the coming years. 
Story first published: Friday, July 18, 2014, 10:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X