షెల్ నుంచి నెక్స్ట్ జనరేషన్ మోటార్ ఆయిల్ విడుదల

By Ravi

ఫినిష్డ్ లూబ్రికెంట్స్‌లో గ్లోబల్ లీడర్ అయిన షెల్ లూబ్రికెంట్స్ భారత్‌లో తమ నెక్స్ట్ జనరేషన్ మోటార్ ఆయిల్‌ని ప్రవేశపెట్టింది. షెల్ ప్యూర్‌ప్లస్ టెక్నాలజీతో తయారు చేసిన షెల్ హెలిక్స్ ఆల్ట్రా అనే మోటార్ ఆయిల్‌‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి లభిస్తున్న అత్యంత అధునాతన మోటార్ ఆయిల్ అని, సహయ వాయువు (న్యూచరల్ గ్యాస్) నుంచి దీనిని తయారు చేశామని కంపెనీ పేర్కొంది.

అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుని గ్యాస్‌ టూ లిక్విడ్‌ (జిటిఎల్‌) ప్రాసెస్‌ ద్వారా సహజ వాయువును క్రిస్టల్‌ క్లియర్‌ చమురుగా తయారు చేస్తారని షెల్ ఆయిల్స్ వివరించింది. ఈ కొత్త ఉత్పత్తిని మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, షెల్ లూబ్రికెంట్స్ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ నితిన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. విప్లవాత్మక గ్యాస్‌ టు లిక్విడ్‌ టెక్నాలజీ (జిటిఎల్‌) సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకుని కొత్త ప్రాడక్టును భారత్‌ మార్కెట్లో ప్రవేశపెట్టినందుకు గర్వంగా ఉందని చెప్పారు.

Shell Introduces Revolution In Indian Lubricant Industry

గడచిన కొన్ని దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా షెల్‌ ప్రయోగశాలలో ఈ మోటార్ ఆయిల్‌పై పెద్ద ఎత్తున పరిశోధనలు జరిపిన తర్వాత, ఈ అధునాతన తర్వాతి తరం (నెక్స్ట్‌ జనరేషన్‌) మోటార్‌ ఆయిల్‌ను కొనుగొన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ భాగం సింథటిక్‌ ఉత్పత్తులే లభిస్తున్నాయని, ఈ నేపథ్యంలో తాము వినూత్నంగా ఆలోచించి ఈ ప్రాడక్టును విడుదల చేశామని చెప్పారు.
Most Read Articles

English summary
Shell Lubricants, the global market share leader in finished lubricants, today announced the launch of a next generation motor oil in India, Shell Helix Ultra with Shell PurePlus Technology - the company’s most advanced motor oil ever, featuring a base oil designed from natural gas.
Story first published: Thursday, September 11, 2014, 12:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X