గుజరాత్: డ్రైవింగ్ చేస్తూ పొగ త్రాగితే లైసెన్స్ రద్దు

By Ravi

పొగ త్రాగటం ఆరోగ్యానికే కాదు డ్రైవింగ్ లైసెన్స్‌కు కూడా హానికరమే. ధూమపానం చేసే అలవాటు ఉన్న చాలా మంది వాహనం నడుపుతూనే పొగ త్రాగుతూ ఉంటారు. అలా చేయటం వలన ప్రమాదం ఉండదని చాలా మంది భావిస్తుంటారు. అయితే, ఇకపై గుజరాత్‌లో పొగ త్రాగుతూ ఎవరైనా వాహనం నడుపుతున్న పోలీసుల కంట్లో పడితే వారు తమ లైసెన్స్‌ను కోల్పోవాల్సిందే.

అధిక వేగంతో వెళ్లటం, ధూమపానం చేయటం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్స్ వినియోగించడం, మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయటం, రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్ చేయటం, అధిక లోడ్ వంటి మొత్తం 19 అంశాలను గుజరాత్ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.

no smoking in gujarat

పైన తెలిపిన నిబంధనలను అతిక్రమించిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే అధికారాలు వీరికి కేటాయించింది. ట్రాఫిక్ విభాగానికి చెందిన సిటీ పోలీసులు నిబంధనలు అతిక్రమించిన వాహనాల యజమానులను నిలిపి, వారిపై చర్యలు తీసుకుంటారని రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ బిఎమ్ ప్రజాపతి వెల్లడించారు.

కమీషనర్ నిర్దేశించిన ఈ 19 నిబంధనలలో దేనినైనా అతిక్రమించి పట్టుబడిన వాహన యజమానిపై చర్యలు తీసుకుంటారు. మొదటి తప్పుకు నోటీసు ఇవ్వటం జరుగుతుందని, ఆ తర్వాత కూడా అదే తప్పును చేసినట్లయితే లైసెన్స్ సస్పెండ్ చేయటం లేదా టెర్మినేట్ చేయటం జరుగుతుందని గుజరాత్ ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. ఈ రూల్ మన స్టేట్‌లో కూడా వస్తే బాగుంటుంది కదూ..!

Most Read Articles

English summary
People smoking in their vehicles is very common. It seems totally harmless and okay to do it to a few. Now, the Regional Transport Authority (RTO) will take action against smoking in cars which could end up in one losing their licence.
Story first published: Saturday, August 9, 2014, 10:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X