టాటా బోల్ట్ విడుదల వాయిదా; జెస్ట్ అమ్మకాలే కారణమా?

By Staff

టాటా మోటార్స్ నుంచి ఈ ఏడాది విడుదల కావల్సి ఉన్న సరికొత్త బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ విడుదల మరో మూడు నెలలకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో అత్యంత సరసమైన ధరకే (రూ.4.64 లక్షల ప్రారంభ ధర, బేస్ పెట్రోల్ వేరియంట్, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో విడుదల చేసిన టాటా జెస్ట్ మోడల్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది.

అయితే, ప్రస్తుతం ఈ మోడల్ అమ్మకాలు కంపెనీ ఆశించిన రీతిలో సాగటం లేదని తెలుస్తోంది. డిమాండ్ తగ్గుదల మరియు ఉత్పత్తి సమస్యల కారణంగా టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ విడుదలను మరో మూడు నెలలకు వాయిదా వేసినట్లు సమాచారం. విస్టా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను రీప్లేస్ చేస్తూ తయారు చేసిన బోల్ట్ ఉత్పత్తిని డిసెంబర్ 2014లో ప్రారంభించనున్నారు.


ఈ నేపథ్యంలో, వచ్చే ఏడాది (2015) జనవరి-ఫిబ్రవరి మధ్య కాలంలో మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఉత్పత్తి వ్యయాన్ని తక్కువగా ఉంచేందుకు గాను టాటా జెస్ట్, మరియు టాటా బోల్ట్ మోడళ్లను రెండింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో అనేక సిమిలారిటీలు ఉండున్నాయి. ఇంజన్ పరంగా కూడా మార్పులు ఉండబోవు.

టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ఉపయోగించిన ఇంజన్ ఆప్షన్లనే ఈ కొత్త టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌లోను ఆఫర్ చేయనున్నారు. ఈ రెండు మోడళ్లు ముందు వైపు నుంచి చూడటానికి ఒకేలా ఉంటాయి, ఇంటీరియర్స్ కూడా ఇంచు మించు ఒకే మాదిరిగా ఉంటాయి.

పెట్రోల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ లేదా ఏఎమ్‌టి గేర్‌‌బాక్స్ లభ్యత గురించి సమాచారం అందుబాటులో లేదు.

Tata Bolt Launch Delayed Due To Low Zest Sales

డీజిల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో కూడా ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, టాటా జెస్ట్ మాదిరిగా డీజిల్ వెర్షన్ బోల్ట్ టాప్-ఎండ్ వేరియంట్‌లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

టాటా 'హ్యుమినిటీ' లైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, కొత్త బంపర్స్, కొత్త కలర్ ఆప్షన్స్‌‌తో పాటుగా ఇందులో 5 ఇంచ్ టచ్‍స్క్రీన్‌తో కూడిన హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ రికగ్నైజేషన్ అండ్ టెక్స్ట్ టూ స్పీచ్ సిస్టమ్, ఫోన్ ఆధారిగా నావిగేషన్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి పలు ప్రీమియం ఫీచర్లు లభ్యం కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Very low demand for the new Tata Zest sedan, has made Tata, one of India's largest carmakers, delay the launch of the Bolt by about three months to early next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X